Movies

పూరీ, ఛార్మి‌లకు ఈడీ సమన్లు

పూరీ, ఛార్మి‌లకు ఈడీ సమన్లు

విజయ్ దేవర కొండ హీరోగా నటించిన సినిమా లైగర్ ). పూరీ జగన్నాథ్డై రెక్షన్ చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఛార్మి కౌర్ సహ నిర్మాతగా వ్యవహరించింది. దాదాపుగా రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మిలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చాయని చెప్పారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పూరీ, ఛార్మిలకు ఈడీ అధికారులు సమన్లు అందజేశారు. ఈ లావాదేవీల విషయంలో వారిద్దరిని ప్రశ్నిస్తున్నారు. ‘లైగర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ‘లైగర్’ ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో.. డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా భారీ ధరలకు అమ్మారు. ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాన్ని మిగిల్చింది. ఫలితంగా వారంతా నష్టపరిహారాన్ని ఇవ్వాలని పూరీ జగన్నాథ్‌ను కోరారు. ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో తనకు భద్రతను కల్పించాలని కోరుతూ పూరీ జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు.