NRI-NRT

TSCS కృషిని అభినందించిన తానా

TSCS కృషిని అభినందించిన తానా

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా).. అమెరికాలోని తెలుగు వాళ్లకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పేద ప్రజలకూ అండగా ఉంటూ ఏటా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే TANA.. మరో మంచి పని చేసింది. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరకు, ట్రెజరర్ అశోక్ కొల్లం.. తాజాగా హైదారాబాద్‌లోని TSCS(Thalasemmia and Sickle Cell Soceity)ని సందర్శించారు. తలసేమియాతో బాధపడుతున్న పేద చిన్నారులకు.. TSCS ఏ విధంగా అండగా నిలుస్తుందో ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు రత్నవళ్లిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం TSCS చేస్తున్న కృషిని అభినందించారు. ఈ క్రమంలోనే అశోక్ కొల్లం.. TSCS భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను తెలుసుకుని ప్రశంసించారు. ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించారు. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో తానా, కొల్లం సాకేత్ ఫౌండేషన్ తరఫున.. రూ.13లక్షల చెక్కును విరాళంగా TSCS ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నరేష్ రాతి, డాక్టర్ సుమన్ జైన్, డాక్టర్ అగర్వాల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.