DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

* పామర్రు, పమిడిముక్కల మండలం, లంకపల్లి కృష్ణానది పాయలో మృతదేహాలు కలకలం రేపాయి. కృష్ణానది ఇసుక తెన్నేల్లో గుర్తుపట్టలేని స్థితిలో రెండు పురుష మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అస్తిపంజరాలుగా మారిన మృతదేహాలను ఇసుక తెన్నేల్లో నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్టుకు పోలీసులు చేర్చారు. మృతులు 45 రోజులలోపు మరణించినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వరద నీటిలో కోట్టుకు వచ్చాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పమిడిముక్కల పోలీసులు విచారణ ప్రారంభించారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని కారంచేడు మండలం కుంకల మర్రు గ్రామానికి చెందిన సీహెచ్‌ నాగమణి పర్చూరు మండలం గొల్లపూడిలో వీఆర్వోగా పనిచేస్తుంది. శుక్రవారం ఆమె చీరాల స్టేషన్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు

* హిందూ యువతిని ముస్లిం ప్రియుడు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. భారత్‌ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్యను పోలిన ఈ సంఘటన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో జరిగింది. అబూ బకర్ అనే వ్యక్తి ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ నెల 6న అతడు పనికి రాలేదు. యజమాని ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌లో ఉంది. దీంతో అతడు అద్దెకున్న ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆ ఇంటి యజమాని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

* డ్రైవర్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. రాజమండ్రి అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీ బెయిల్‌ పిటిషన్‌ను డిసెంబర్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మే రెండోవారం దారుణ హత్యకు గురయ్యాడుహత్యకు ప్రధాన కారణం తానేనంటూ కోర్టులో లొంగిన ఎమ్మెల్సీ మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి బెయిల్‌ కోసం పలుమార్లు వేసిన పిటిషన్లను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు, ఏపీ హైకోర్టు తిరస్కరిస్తూ వస్తుంది. కాగా అనంతబాబు తరుఫు న్యాయవాది డిఫాల్ట్‌ బెయిల్ మంజూరు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా డిసెంబర్‌ 12న విచారణకు రానున్నది .

* కృష్ణా జిల్లా: పెడనలో మంత్రి జోగి రమేష్ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే జనసేన కార్యకర్తలపై దాడికి దిగారు. తమపై దాడి జరుగుతున్నా.. పోలీసులు చోద్యం చూశారని, ప్రేక్షకపాత్ర వహించారని, ఎస్ఐ కూడా తమ వాళ్లనే కొట్టారని జనసేన నేతలు వాపోయారు. ఎవరో పోస్టర్లు అతికిస్తే తమపై దాడి చేయడంఏంటని ప్రశ్నించారు. మంత్రి జోగి రమేష్, పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*పెడనలో జనసేన నాయకులు గత కొంతకాలంగా ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అక్కడ కొన్ని పోస్టర్లు వెలిశాయి. జనసేన నేతలే ఆ పోస్టర్లు వేశారని కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన నేతలు పీఎస్‌కు వెళ్లారు. అప్పటికే మంత్రి జోగిరమేష్ అనుచరులు కొంతమంది పోలీస్ స్టేషన్‌లో చొరబడి పోలీసుల ముందే తమ కార్యకర్తలపై దాడి చేశారని, ఇదేంటని ప్రశ్నించినందుకు ఎస్ఐ కూడా దౌర్జన్యం చేశారని జనసేన నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పీఎస్ ముందే ఆందోళనకు దిగారు. దీంతో జనసేన నేతలను పోలీసులు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. ఈ ఘటనపై ఎస్పీ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని జనసేన నేతలు హెచ్చరించారు

* మహారాష్ట్రలోని ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్ వేపై ఖపోలీ ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సంఘటన స్థలంలో నలుగురు అక్కడికి అక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.క్షతగాత్రులను నవీ ముంబయి సమీపంలోని కామోథీలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.అతి వేగం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై అతివేగం వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదానికి గురైన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.

*పాలస్తీనా దేశంలోని గాజా నగరంలోని ఉత్తరాన ఉన్న ఒక ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు పిల్లలతో సహా 21 మంది మరణించారు. ఓ ఇంట్లో ఇంధనం నిల్వ చేయడంతో అగ్నిప్రమాదం జరిగిందని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, హమాస్ ఇస్లామిస్ట్ లు మంటలను అదుపు చేయగలిగారు. ఈ అగ్నిప్రమాదంతో కాలిపోయిన గోడలు, నల్లమసితో మట్టిదిబ్బలు కనిపించాయి.ఈ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించినట్లు గాజా పౌర రక్షణ విభాగం ఒక ప్రకటనలో ధృవీకరించింది.

*పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలోని రెండో అంతస్తులో రాజుకున్న మంటలు నిమిషాల వ్యవధిలోనే సీటీ స్కాన్ గది, ఎక్స్ రే రూంలోకి వ్యాపించాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.అదృష్టవశాత్తూ ఈ అగ్ని ప్రమాదంలో రోగులెవరూ గాయపడలేదు.10 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రులు ఫిర్హాద్ హకీం, అరుప్ బిశ్వాస్, డీసీపీ ఆకాష్ మఘారియాలు సందర్శించారు.

*పాలస్తీనా దేశంలోని గాజా నగరంలోని ఉత్తరాన ఉన్న ఒక ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు పిల్లలతో సహా 21 మంది మరణించారు. ఓ ఇంట్లో ఇంధనం నిల్వ చేయడంతో అగ్నిప్రమాదం జరిగిందని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, హమాస్ ఇస్లామిస్ట్ లు మంటలను అదుపు చేయగలిగారు. ఈ అగ్నిప్రమాదంతో కాలిపోయిన గోడలు, నల్లమసితో మట్టిదిబ్బలు కనిపించాయి.ఈ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించినట్లు గాజా పౌర రక్షణ విభాగం ఒక ప్రకటనలో ధృవీకరించింది.

* గొడ్డలితో దాడిచేసిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయా లయ్యాయి. బాధితులు, ఏరియా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు…. పట్టణంలోని పెద మాదిగవీధికి చెందిన పొట్నూరు అశోక్‌ ఆయన భార్య సోనితో పాటు అన్యయ్య వాసుపై అదే వీధికి చెందిన కూర్మణ అఖిల్‌ పాతకక్షల నేపథ్యం లో శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో దాడిచేశాడు.దీంతో అశోక్‌కు, ఆయన భార్య, అన్యయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంధువులు జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదుచేసినట్లు ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపారు.

*రాయగడ వైపు నుం చి పార్వతీపురం వస్తున్న లారీ అదు పు తప్పి బోల్తా ప డింది. గురువారం సాయంత్రం జరిగిన ఘటనలో ఎటువం టి ప్రాణ నష్టం జరగలేదు. బొగ్గు లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి గుమడ గ్రామ సమీపంలో బోల్తా పడింది.

* ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించిన కంచికచర్ల పోలీసులువిశాఖ నుండి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్న రెండు కార్లను కీసర్ టోల్ ప్లాజా వద్ద కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు.గుట్టు చప్పుడు కాకుండా రెండు కార్లలో 100 కేజీల గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు.పక్కా సమాచారంతో రెండు కార్లతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న కంచికచర్ల పోలీసులురెండు కార్లలో ప్రత్యేకంగా అమర్చిన ఆరలలో 100 కేజీల గంజాయి దాచిన గంజాయి సప్లయర్లురెండు కార్లను కంచికచర్ల పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.ముగ్గురు వ్యక్తుల నుండి పూర్తి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు…

* విశాఖ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న గంజాయిని కీసర్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న కంచికచర్ల పోలీసులు…..గుట్టు చప్పుడు కాకుండా రెండు కార్లలో 100 కేజీల గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు…..పక్కా సమాచారంతో రెండు కార్లతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు….రెండు కార్లలో ప్రత్యేకంగా అమర్చిన ఆరలలో 100 కేజీల గంజాయి దాచిన గంజాయి సప్లయర్లు…..కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు రెండు కార్లతో సహా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు తరలింపు…..పూర్తి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు.

* మహారాష్ట్రలోని ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్స్‌ప్రెస్ వేపై ఖపోలీ ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సంఘటన స్థలంలో నలుగురు అక్కడికి అక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.క్షతగాత్రులను నవీ ముంబయి సమీపంలోని కామోథీలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.అతి వేగం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై అతివేగం వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదానికి గురైన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.

* నార్త్ ఇరాక్‌ (Northern Iraq)లోని సులైమానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధనం ట్యాంక్ (Fuel tank) పేలి 11 మంది దుర్మరణం పాలయ్యారు. 13 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఒక ఇల్లు కుప్పకూలిపోయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్టు సిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చీఫ్ సమన్ నార్ తెలిపారు. ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పారు.