NRI-NRT

అమెరికాలో లే ఆఫ్ లతో భారతీయుల ఇక్కట్లు

అమెరికాలో లే ఆఫ్ లతో భారతీయుల ఇక్కట్లు

మైక్రోసాఫ్ట్ పిలుపు మేరకు 14 ఏండ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు సత్య ప్రకాశ్. ప్రొఫెషనల్లీ అద్భుతమైన పని తీరు ప్రదర్శించడంతో కుటుంబం ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగు బెడ్ రూమ్‌ల ఇల్లు కొనుక్కున్నాడు. ప్ర‌స్తుతం వాషింగ్ట‌న్‌లోని బెల్లెవ్యూలో నివ‌సిస్తున్న స‌త్య ప్ర‌కాశ్‌.. గ‌త అక్టోబ‌ర్‌లో భారీ ఉద్వాస‌న‌ల్లో భాగంగా ఉద్యోగం కోల్పోయాడు. 12 ఏండ్లుగా గ్రీన్ కార్డ్ కోసం ఎడ‌తెగ‌ని ప్ర‌యత్నాలు చేస్తున్న స‌త్య ప్ర‌కాశ్‌.. ఇప్పుడు అక‌స్మాత్తుగా 60 రోజుల్లో మ‌రో జాబ్ పొందాలి.. లేదా గ్రీన్ కార్డు హోల్డ‌ర్ అయి ఉండాలి.. కాదంటే భార‌త్‌కు తిరిగి వ‌చ్చేయాల్సిందే. అంటే 14 ఏండ్లుగా హెచ్‌-1 బీ వీసాపైనే ప‌ని చేస్తున్నాడు. అమెరికా చ‌ట్టం ప్ర‌కారం హెచ్‌-1 బీ వీసా కింద ఒక కంపెనీలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఉద్వాస‌న‌కు గురైతే రెండు నెల‌ల్లో మ‌రో ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. శ‌ర‌వేగంగా వృద్ధి రేటుపై పైపైకి దూసుకెళ్తున్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం.. అటుపై ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో వ‌డ్డీరేట్ల వ‌డ్డింపు.. మాంద్యం దిశ‌గా అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ సాగుతున్న‌ది. ఈ క్ర‌మంలో టెక్ సంస్థ‌లు మొద‌లు అన్ని ర‌కాల సంస్థ‌లు పొదుపు చర్య‌ల్లో భాగంగా ఉద్యోగుల‌ను తొల‌గించేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 1.46 ల‌క్ష‌ల మంది ఉద్వాస‌న‌కు గురి కాగా, గ‌త న‌వంబ‌ర్ నెల‌లోనే 51 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. టెక్ దిగ్గ‌జాలు మాత్ర‌మే కాదు.. ఇత‌ర సంస్థ‌లు సైతం ఉద్యోగుల‌ను ఇబ్బ‌డిముబ్బ‌డిగా తొల‌గించేస్తున్నాయి. దీంతో వారి హెచ్‌-1 బీ వీసా స్టేట‌స్ కాస్త టెంప‌ర‌రీ విజిట‌ర్ స్టేట‌స్‌కు మారుతోంది. 60 రోజుల్లో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.ఇదిలా ఉంటే, కంపెనీలు కూడా ఎంత మందిని తొల‌గించామ‌న్న సంగ‌తి వెల్ల‌డించ‌డం లేదు. అంతే కాదు.. కొత్త ఉద్యోగ నియామ‌కాల‌పైనా ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఫ‌లితంగా టెక్ దిగ్గ‌జాల్లో ఉద్వాస‌న‌కు గురైన వారు కొత్త ఉద్యోగాలు పొంద‌డానికి త‌క్కువ అవ‌కాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.అమెరికాలో హెచ్‌1 బీ వీసాలు క‌లిగి ఉన్న వారు ఐదు ల‌క్ష‌ల పై మాటే. వారిలో అత్య‌ధిక శాతం భార‌త్‌, చైనా నుంచి వ‌చ్చిన నిపుణులే. 2000-19 మ‌ధ్య టెక్ నిపుణుల కోసం అమెరికాలో 44 శాతం డిమాండ్ పెరిగింది. అంటే 70 ల‌క్ష‌ల నుంచి 1.08 కోట్ల మందికి పైగా టెక్ నిపుణులు ఈ కాలంలో అమెరికాలో నియ‌మితుల‌య్యారు.2000తో పోలిస్తే 2019లో ఒక త్రైమాసికంలో 16 శాతం మంది నిపుణులు ఉద్యోగాల్లో చేరారు. ట్విట్ట‌ర్‌లో కీల‌క విభాగంలో ప‌ని చేసిన ఇండియ‌న్ సైతం ఇప్పుడు ఉద్వాస‌న‌కు గుర‌య్యారు. దీంతో ఆ నిపుణురాలు కొత్త కొలువు కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఏడాది అమెరికాలోని సంస్థ‌లు 85 వేల హెచ్‌-1 బీ వీసాల కోసం 4.80 ల‌క్ష‌లకు పైగా అప్లికేష‌న్లు దాఖ‌లు చేశాయి