Politics

2024 తర్వాత మీరు ఇంటికి.. మేం ఢిల్లీకి : కేసీఆర్..

2024 తర్వాత మీరు ఇంటికి.. మేం ఢిల్లీకి : కేసీఆర్..

ఖమ్మం: బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో కరెంట్ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ వాగ్ధానం చేశారు. దేశ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.నదీ జలాలతో ప్రజల గొంతు నింపాలని, పొలాలను తడపాలని పేర్కొన్నారు. దీనిని నిజం చేసేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టిందని, అవసరమైతే మరో ఉద్యమం తప్పదని అన్నారు. దేశంలో ఇంకా నీటి యుద్ధాలు అవసరమా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య కేంద్రం కొట్లాటలు పెడుతోందని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందేనని అన్నారు. రాజకీయ విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలు వదిలేశారంటూ, దేశంలోని వ్యవస్థలను ప్రయివేటీకరిస్తున్నారని కేంద్రంపై కేసీఆర్ మండిపడ్డారు. ఎల్‌ఐసీని ప్రయివేటీకరణను తప్పుబట్టిన ఆయన బీజేపీ సర్కార్ ప్రయివేటీకరిస్తున్న సంస్థలను వెనక్కి తీసుకువస్తామని ఆయన తెలిపారు. విద్యుత్ రంగం ప్రయివేట్ సెక్టార్‌లోనే ఉంటుందని స్పష్టంఇంటికి.. మేం ఢిల్లీకి’ అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారు. దేశంలో ప్రభలమైన మార్పునకు ఖమ్మం సభ సంకేతమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుతమైన సభని అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఖమ్మం భారీ బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం అవుతున్నాయని ప్రస్తావించారు.