DailyDose

TNI. నేటి తాజా వార్తలు..

TNI. నేటి తాజా వార్తలు..

*హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు.

వివేక హత్య కేసులో ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈ మేరకు పిటిషన్ వేశారు.

దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించారు.

దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదన్నారు.

సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్‌మెంట్ ఇస్తున్నాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు.

వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడన్నారు.

అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వటం సరికాదన్నారు.

వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరి అని చెప్పారు.

దస్తగిరి బెయిల్ సమయంలో సీబీఐ సహకరించిందని.. అతనిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు.

దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు

* R-5 జోన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా
– ప్రభుత్వం, సీఆర్డీఏను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
– ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ఏపీ హైకోర్టు – గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకమన్న పిటిషనర్ తరపు న్యాయవాదులు
– రాజధాని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయవాదులు
– పిటిషనర్ తరపు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దేవదత్ కామత్, లాయర్లు ఆంజనేయులు, ఉణ్నం మురళీధర్ వాదనలు
– ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని, అక్కడికి వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించిన ధర్మాసనం
– ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామన్న హైకోర్టు
– రాజధాని భూములపై మాత్రమే మాట్లాడుతున్నామన్న లాయర్లు
– రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయ సమ్మతం కాదన్న పిటిషనర్ తరపు న్యాయవాదులు
– మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడతామన్న హైకోర్టు
– తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా

* బిగ్

హైదరాబాద్

టి.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ జనార్దన్ రెడ్డి ని మూడు గంటలుగా విచారిస్తున్న సిట్

*

ఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు.

బేగంపేట్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు.

ముందుగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదే రోజున మోడీ ప్రారంభించనున్నారు.

ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ రైలు కావడం విశేషం.

ఈ రైలు వలన సికింద్రాబాద్ తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8.30 గంటల వరకు తగ్గనుంది.

ఆనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ పరిశీలించారు

*వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్

తేదీ: 3-04-2023

స్థలం: తాడేపల్లి

ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్ర‌చారాన్ని సోష‌ల్ మీడియాతో తిప్పికొట్టాలి

ముంద‌స్తు ఎన్నిక‌లు, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ఆగస్టు నాటికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలి

ఈ నెల 13 నుంచి జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మం

ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోను

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతీ కుటుంబానికీ తీసుకెళ్లాలి

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌ మీడియాతో పాటు ఎల్లో బ్యాచ్‌ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తిప్పికొట్టాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.  సోమవారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిల‌తో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశ‌మై తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు. రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ఈ సందర్భంగా ఆయన పుల్‌స్టాప్‌ పెట్టారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు సీఎం జ‌గ‌న్‌ స్పష్టం చేశారు. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు.  రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించే అంశాన్ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఎల్లో మీడియా ప్ర‌చారాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తిప్పికొట్టాల‌ని దిశానిర్దేశం చేశారు. క్యాడ‌ర్ అంతా కూడా యాక్టివ్‌గా ఉండాల‌న్నారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణతో పాటు 60 మంది ఎమ్మెల్యేల‌కు టికెట్లు లేవ‌న్న ప్ర‌చారం న‌మ్మొద్ద‌ని సూచించారు. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉండ‌టంతో పూర్తిగా వినియోగించుకోవాల‌ని సూచించారు.  

సమావేశంలో సీఎం జగన్ వెల్లడించిన విషయాలు

మళ్లీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సగం సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం పూర్తి చేశారని తెలిపారు. ఆగస్టు నాటికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలన్నారు. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని సీఎం గుర్తు చేశారు. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏవో మాటలు చెబుతున్నారు. ఇటీవల 21 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే మనం 17 స్థానాల్లో గెలిచామన్నారు. టీడీపీ వాపును చూసి బలం అనుకుంటుందని చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి ఇంతకంటే దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టాలని సూచించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోవడం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోనని ఉద్ఘాటించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతీ కుటుంబానికీ తీసుకెళ్లాలని సూచించారు. వాలంటీర్లను, గృహ సారధులను మమేకం చేసుకోవాలన్నారు. బీపీఎల్‌ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని నెలకు రూ.10 వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల వారిని అర్హులుగా గుర్తించి సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. ఎలాంటి వివక్ష..లంచాలకు తావు లేకుండా రూ.2 లక్షల కోట్లకు పైగా అక్కాచెల్లెమ్మల అకౌంట్లలో నగదు జమ చేశామన్నారు. 84 శాతం అర్బన్‌ ప్రాంతంలో, 92 శాతం రూరల్‌ ప్రాంతంలో యావరేజ్‌గా 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగామని వివరించారు. పేదవాడు మిస్‌ కాకుండా వెరిఫికేషన్‌ చేసి మరీ పథకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల స‌మావేశంలో వ్యాఖ్యానించారు.

*ఓం నమో వేంకటేశాయ 🙏

తిరుమల: శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం నిర్వహించినటువంటి స్వర్ణ రథోత్సవంలో శ్రీ, భూ, సవేత శ్రీ మలయప్ప స్వామి వారు అత్యంత వైభవోపేతంగా తిరుమాడ వీధులలో విహరించారు

* మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ విచారణ జరుపుతున్న ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది.

ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ ఇప్పటికే 30 మంది మేనేజర్లకు నోటీసులు ఇచ్చింది. నిన్న రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును కూడా సీఐడీ అధికారులు విచారించారు.

ఈ నేపథ్యంలో, సీఐడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రామోజీరావు ఆరోగ్య పరిస్థితిని, ఆయనను విచారించిన తీరును పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, సీఐడీ కస్టడీలో ఉన్న మార్గదర్శి ఆడిటర్ కు గాయాలయ్యాయని తెలిపారు

* అమరావతి.

సజ్జల రామకృష్ణారెడ్డి ..వైసిపి ప్రధాన కార్యదర్శి.

సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం

ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది.

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.

లక్షలాది మంది కార్యకర్తలు… స్థానిక ప్రజా ప్రతినిధులు.వలంటీర్లు .గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

మొత్తం యంత్రాగం అంతా శాసన సభ్యులు. రీజినల్ కో ఆర్డినెటర్ల నేతృత్వంలో జరుగుతుంది..

జగనన్నే మా భవిష్యత్… మా నమ్మకం నువ్వే జగన్ అనేది జనంలోంచి వచ్చిన నినాదం….

ప్రజల జీవితాల్లో మార్పు రావడమే ప్రభుత్వ లక్ష్యం

మేనిఫెస్టో అమలు దగ్గర్నుంచి లక్ష్యం చేరే వరకు పేదల కుటుంబాల్లో వెలుగు కోసమే సీఎం జగన్ ప్రయత్నం.

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం తో మార్పు కనిపిస్తోంది అనేది ప్రజల మాటల్లో అర్ధం అయింది ..

ప్రజల నుంచి వచ్చిన నినాదమే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం

* 6న మద్యం అమ్మకాలు బాంద్

రాచకొండ కమిషనర్ పరిధిలో మద్యం అమ్మకాలు బంద్…

హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 6 న తేదీన మద్యం అమ్మకాలు పూర్తిగా బంద్ ఉంటాయని రాచకొండ సిపి డి ఎస్ చౌహన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

*PRESS NOTE

రూ.380 కోట్లకు పెరిగిన అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం
• జూలై నాటికి పూర్తి కానున్న విగ్రహ నిర్మాణం
• మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 4: బీఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.268 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేద్కర్ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున వెల్లడించారు. నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా జరుగుతున్న స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున అంబేద్కర్ స్మృతివనం పనులను సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో మారుమూలన రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ లో వేల కోట్ల రుపాయల విలువైన పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ భూములను అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి కేటాయించడంతో పాటుగా రూ.268 కోట్ల ను మంజూరు చేసారని తెలిపారు. అయితే స్మృతివనం లో చిరస్థాయిగా నిలిచిపోయేలా మరికొన్ని భవనాలను నిర్మించాలని, స్మృతివనం ప్రాంగణాన్ని అత్యాధునిక పద్ధతుల్లో సుందరీకరించాలని నిర్ణయించడంతో అదనంగా మరో రూ.106 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇది కాకుండా పురపాలక శాఖ కూడా మరో రూ.6 కోట్లను స్మృతివనం పనులకు మంజూరు చేసిందని ఈ లెక్కన ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.380 కోట్లకు చేరిందని వివరించారు. విగ్రహావిష్కరణ పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా స్మృతివనం పనులు చరిత్రలో మిగిలిపోయేలా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో దేశంలో మరెక్కడా లేని విధంగా ఈపనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం హరియాణలో జరుగుతుండగా దానికి సమాంతరంగా పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో స్మృతివనం పనులు రాత్రీ పగలూ జరుగుతున్నాయని జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాటికి స్మృతివనం పనులను పూర్తి చేయాలనుకున్నా అనివార్యకారణాలతో జూలై నాటికి స్మృతివనం పనులను పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాగార్జున తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, సందర్శకులకు ఒక మంచి అనుభూతిని కలిగించే విధంగా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్మృతివనంలో భాగంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణపనులను వేగవంతం చేయాలని, మరింత ఎక్కువ మంది కార్మికులను ఈ పనుల్లో వినియోగించాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహ శిల్పి నరేష్ విగ్రహ నిర్మాణపనుల పురోగతిని వివరించారు. ఏపీఐఐసి అధికారులు స్మృతివనం పనుల ప్రగతిని పీపీటీ ద్వారా ప్రదర్శించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కే.హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపుర్, విజయవాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్, ఏపీఐఐసి సిఇ నరసింహారావు, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు.
•ఫోటోవార్త: అంబేద్కర్ స్మృతివనం పనుల పురోగతిని సమీక్షిస్తున్న మంత్రి మేరుగు నాగార్జున, సమావేశంలో పాల్గొన్న అధికారులు

* తిరుపతి జిల్లా: దొరవారిసత్రంతో పాటు సమీప గ్రామాల్లో భూ ప్రకంపనలు… కిందపడిన ఇళ్లలో ఉన్న వస్తువులు..భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు