Kids

పిల్లలు కాయగూరలు, పండ్లు తినడం లేదా? నూడుల్స్ ఇష్టమా.. అయితే..

పిల్లలు కాయగూరలు, పండ్లు తినడం లేదా? నూడుల్స్ ఇష్టమా.. అయితే..

చిన్న పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం అవసరం. చాలా మంది పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వారు తినేలా చేయవచ్చు. ఆకుకూరలు, కాయగూరలు తినడం ఇష్టం లేదనే పిల్లలకు కూరగాయలన్నీ కలగలిపి చేసే… గ్రిల్డ్ వెజిటెబుల్ శాండ్విచ్, వెజిటెబుల్ ఆమ్లెట్ లాంటివి తయారు చేసి ఇవ్వవచ్చు.

నూడుల్స్ ఇష్టంగా తినేట్లయితే… అన్ని రకాల కూరల ముక్కలను దాంతో కలిపి వండి ఇవ్వవచ్చు. అన్నంతో లేక నూడుల్స్ గుడ్డు/ఆకుకూరలు/కాయగూరలు కలగలిపి వెజ్ ఫ్రైడ్ రైస్ /ఫ్రైడ్నడుల్స్ కూడా తయారు చేసి తినిపించవచ్చు. మాంసాహారం తినేవారు, చికెన్, మటన్, చేపల కూరలు పెట్టవచ్చు. సాధారణంగా పిల్లలు అవి ఇష్టంగానే తింటారు.

అలాగే లెగ్యూమ్స్ (దాల్స్), బాదాం, జీడిపప్పు, వాల్ నట్ వంటి నట్స్ ఇవ్వాలి. వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్నందున వారికి అవసరమైన అన్ని పోషకాలూ లభిస్తాయి. పండ్లు తినని పిల్లలకు వాటిని ముక్కలు గా కోసి కస్టర్డ్/ఐస్క్రీమ్ కలిపి ఇవ్వడం, ఫ్రూట్ సలాడ్స్ రూపంలో అందించడం లేదా జ్యూస్ గా తీసి ఇవ్వవచ్చు. పండ్లు తినని పిల్లలు కూడా పండ్ల రసాలను ఇష్టం గా తాగుతారు. ఇక పిల్లలు పాలు తాగకపోతే వారికి మిల్క్ షేక్ తయారు చేసి ఇవ్వవచ్చు.