NRI-NRT

భద్రాచలం. ఆడిటోరియం కు తాళ్లూరి ట్రస్ట్ భారీ విరాళం.

భద్రాచలం. ఆడిటోరియం కు తాళ్లూరి ట్రస్ట్ భారీ విరాళం.

తాము పుట్టి పెరిగిన జన్మభూమిలో లక్షలాది రూపాయల ఖర్చుతో భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు తాళ్లూరి సోదరులు వారి సోదరి..

ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న తానా మాజీ అధ్యక్షుడు జయ శేఖర్ తాళ్లూరి ఆయన సోదరుడు ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజా తాళ్లూరి వారి సోదరి డాక్టర్ గొట్టిపాటి అనిత వాళ్ల తల్లిదండ్రులు తాళ్లూరి పంచాక్షరయ్య భారతీదేవి పేరు మీదగా వారి స్వస్థలం భద్రాచలం పక్కనే ఉన్న విరి వెండి తో పాటు భద్రాచలం లోను భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలకు శాశ్వత భవనాలు రైతులు తమ పంటలు దాచుకోవటం కోసం గిడ్డంగులు నిర్మించి ఇచ్చారు. దీనితో పాటు నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం దేవాలయాలు సామాజిక భవనాల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టారు.

ఇటీవల భద్రాచలం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆడిటోరియంను నిర్మించి ఇచ్చారు. దీనికి తమ తల్లిదండ్రులు తాళ్లూరి పంచాక్షరయ్య భారతీ దేవి పేరు పెట్టారు . భారీ విరాళంతో ఆడిటోరియంను నిర్మించి ఇచ్చిన తాళ్లూరి సోదరులను వారి సోదరిని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.