DailyDose

కాఫీ కబుర్లు

కాఫీ కబుర్లు

ఇప్పుడు మన ఇళ్ళల్లో మిక్సర్, గ్రైండర్, ఫ్రిజ్ ల స్థానాల్లో తిరగలి, రుబ్బురోలు, అమన్ దస్తా, కవ్వం, కూజా/కుండా అప్పట్లో ఉండేవి. పొళ్ళు (గుండలు) చేయడానికి తిరగలి, రుబ్బులు, పచ్చళ్ళు చేయడానికి రుబ్బురోలు, తినేవి గట్టిగా ఉంటే.. ముఖ్యంగా నోటిలో పళ్ళు సరిగా లేని వారికి.. మెత్తగా చేసుకుందుకి అమన్ దస్తా, పెరుగు నుంచి మజ్జిగ చిలకడానికి కవ్వం, తాగే నీటిని చల్లగా ఉంచేందుకు కూజా లేక కుండ ఉండేవి. రుబ్బడం, విసరడం, దంచడం వంటివి శ్రమతో కూడుకున్న పని. పైగా సమయం తీసుకుంటాయి. ఐనా వీటితో చేసిన ఆహారం సహజమైన రుచితో ఉంటాయి, ఆరోగ్యాన్నిస్తాయి. ఇంట్లో రుబ్బుకున్న పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. కరెంటు ఖర్చు ఉండదు, కరెంట్ పోయినా వంటకి అవరోధం కాదు. పాడవవు గనుక రిపేర్, భాగాల రీప్లేస్మెంట్ వంటి ఖర్చులు ఉండవు. ఇవి చౌక కూడా. శారీరక శ్రమ ఉంటుంది గనుక వ్యాయామం లాంటిదే కావడంతో శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. విరిగిపోవు.. అటూ ఇటూ తిప్పవలసిన అవసరం ఉండదు. ఐతే యీ ఆధునిక యుగంలో బాగా సౌకర్యాలకి, ఈజీనెస్ కి అలవాటు పడిపోయాం. కూర్చుని చేయలేం.. నిలబడే చేయాలి.. త్వరత్వరగా ఐపోవాలి.. శారీరక శ్రమ ఉండదన్న ఆలోచనే రాదు.