Movies

పవర్ స్టార్, శ్రీలీల మాస్ సర్‌ప్రైజ్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బిగ్ ప్లాన్!

పవర్ స్టార్, శ్రీలీల మాస్ సర్‌ప్రైజ్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బిగ్ ప్లాన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా పవన్ కళ్యాణ్ తనకి సంబందించిన సీక్వెన్స్ ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి జోడీగానే ఆమె పాత్ర ఉండబోతోంది.

అయితే తెరికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ కి సంబందించిన లవ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ట్విట్టర్ ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమాని ఒకరు హరీష్ శంకర్ కి ట్యాగ్ చేసి మూవీలో శ్రీలీల, పవన్ కళ్యాణ్ కి ఒక మాస్ డాన్స్ పెట్టమని కోరాడు.

దీనిపై హరీష్ శంకర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ ష్యూర్ అంటూ హ్యాండ్ తంప్స్ అప్ సింబల్ పెట్టారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఈ రిక్వెస్ట్ చేయడానికి కారణం ఉంది. రీసెంట్ గా ధమాకా సినిమాలో రవితేజతో శ్రీలీల ఒక మాస్ సాంగ్ లో డాన్స్ ఇరగదీసింది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో కూడా అదిరిపోయే స్టెప్పులతో ఒక సాంగ్ పెట్టమని రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి అభిమానుల కోరిక మేరకు హరీష్ శంకర్ శ్రీలీల, పవన్ కళ్యాణ్ తో ఏమైనా మాస్ స్టెప్పులు వేయిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నెల ఆఖరులో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓజీ మూవీ షూటింగ్ ముంబైలో స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక ఆరుళ్ మోహన్ నటిస్తోంది అనే టాక్ వినిపిస్తోంది.