Movies

నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న మహేశ్ బాబు!

నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న మహేశ్ బాబు!

త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న మహేశ్ బాబు ,ఆయన జోడీకడుతున్న శ్రీలీల,ఫారిన్ కి వెళ్లి వచ్చిన మహేశ్ బాబు.ఈ శుక్రవారం నుంచి నెక్స్ట్ షెడ్యూల్ ,వచ్చే సంక్రాంతికి విడుదల.

మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 28వ సినిమా. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, కథానాయికగా శ్రీలీల అలరించనుంది.

ఈ సినిమా షూటింగు ఈ మధ్యనే మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత బ్రేక్ ఇవ్వడంతో, మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన ఆయన, ఈ రోజునే హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు.

ఈ శుక్రవారం నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగు జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘సర్కారువారి పాట’ తరువాత మహేశ్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.