Politics

కాశీ, తెలుగు సంస్కృతుల అనుబంధం గాఢమైనది మోదీ

కాశీ, తెలుగు సంస్కృతుల అనుబంధం గాఢమైనది  మోదీ

కాశీ, తెలుగు సంగమం కార్యక్రమం గంగా-గోదావరి నదుల సంగమంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అభివర్ణించారు.

కాశీ, తెలుగు సంగమం కార్యక్రమం గంగా-గోదావరి నదుల సంగమంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అభివర్ణించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వారణాసికి వెళ్లిన తెలుగువారికి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో జరుగుతుండటం విశేషం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన శనివారం వర్చువల్ విధానంలో మాట్లాడారు.

భారత దేశ వైవిద్ధ్యాల సంగమ కాలం స్వతంత్ర భారత అమృత్ కాలమని తెలిపారు. కాశీ-తెలుగు సంస్కృతుల మధ్య అనుబంధం చాలా గొప్పదని తెలిపారు. ఈ రెండిటి మధ్య గాఢమైన అనుబంధం ఉందన్నారు. ఈ అనుబంధాన్ని, భారత దేశ ఐకమత్యాన్ని చూసి మనం గర్విస్తున్నామని చెప్పారు. మనసులు చేరువైతే, భౌతిక దూరం అంత ముఖ్యమైనది కాదని చెప్పారు. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ యావత్తు భారత దేశం ఐకమత్యంగా, అనుసంధానంగా ఉండటానికి ఇదే కారణమని చెప్పారు. కాశీ, తెలుగు సంస్కృతుల సమ్మేళనమే దీనికి గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ‘ఒక భారత దేశం, శ్రేష్ఠ భారత దేశం’ యొక్క స్ఫూర్తిని ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు.

దేవాలయాలకు వెళ్లే మార్గాలు, సాంస్కృతిక కేంద్రాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లే దారుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. గంగా నదిలో నేడు సీఎన్‌జీ పడవలు ఉన్నాయన్నారు. బెనారస్‌కు వచ్చి, వెళ్లేవారి కోసం త్వరలో రోప్‌వే కూడా రాబోతోందన్నారు.