DailyDose

TNI నేటి తాజా వార్తలు. మార్గదర్శిలో మళ్ళీ సోదాలు. తదితర విశేషాలు

TNI నేటి తాజా వార్తలు. మార్గదర్శిలో మళ్ళీ సోదాలు. తదితర విశేషాలు

* ఢిల్లీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు
గతంలో బీఆర్‌ఎస్ ఎంమ్మెల్సీ కవిత కు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేసారు …

* ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో నాలుగు రోజుల పాటూ వర్షాలు..

రాష్ట్రాన్ని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మరో నాలుగు రోజులు వానలు పడతాయి అంటున్నారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్ల కింద ఉండొద్దని.. రైతులు, గొర్లె కాపర్లు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శనివారం ఉత్తరాంధ్రతో పాటూ కోస్తా, రాయలసీమలకు వర్ష సూచన చేసిన వాతావరణశాఖ. మరోసారి వానలు పడతాయన్న వాతావరణశాఖ అంచనాతో రైతుల్లో ఆందోళణ వ్యక్తమవుతోంది…
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. మరో రెండు గంటలపాటు కుండపోత!

• ఈ తెల్లవారుజామున భారీ వర్షం

• జలమయమైన రోడ్లు

• పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

• ఏపీ, తెలంగాణకు రెండురోజులపాటు వర్ష సూచన

*Breaking
– – –
CBI Court Extends judicial remand for Bhasker Reddy till May 10.

* ఏపీలో మార్గదర్శి బ్రాంచ్‌ల్లో సీఐడీ సోదాలు

గాజువాక, సీతంపేట, తెనాలి మార్గదర్శి బ్రాంచ్‌ల్లో సీఐడీ తనిఖీలు

డిపాజిట్‌ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై తనిఖీలు

మార్గదర్శి బ్రాంచ్‌ల్లో రికార్డులను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

* బైజూస్ సీఈవో రవీంద్రన్ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

బెంగళూరు: బైజూస్ సీఈవో రవీంద్రన్ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కింద ఈడీ తనిఖీలు చేస్తోంది. మొత్తం మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ కంపెనీ 2011 నుంచి 2023 మధ్య 28వేల కోట్ల విలువైన ఎఫ్ఎఐ(విదేశీ పెట్టుబడులు)లు అందుకున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

*

వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి మే 10 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు

*

బాపట్లలో సినీ నటి సమంతకు గుడి కట్టించి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన సమంత వీరాభిమాని

*

చిన్న ప్రయత్నం కానీ ఎంతో విలువైనది. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు ఇలా బాటిల్, కాన్ లలో పడేయడం వలన జంతువులకు, పక్షులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ప్రకృతికి కూడా మంచిది..!!

* టీచర్లకు వేసవి సెలవుల్లేవ్! పనులు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసిన        విద్యాశాఖ!

వేసవి సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు

ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళనచెందుతున్నారు.

వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు.

శివ శంకర్. చలువాది

ఏపీలో వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్‌ షీట్‌ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడడం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 1నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నతాధికారులు ఆదేశాలనిచ్చారు.

ఉపాధ్యాయులు బడికి రావాలా? వద్దా? అనే దానిపై స్పష్టత ఇవ్వకుండానే అనేక పనులు అప్పగించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ‘నాడు-నేడు’ పనులు, పదో తరగతి ఫలితాల తర్వాత టీసీల జారీ, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు బడులకు రావాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సెలవు పెడితే ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. 3,4,5 తరగతులకు వర్క్‌షీట్లను ఇవ్వాలని ఆదేశించిన అధికారులు ముద్రించిన వాటిని మాత్రం సమకూర్చలేదు. వాటిని జిరాక్స్‌ తీసేందుకు ఉపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించాలి.

గ్రంథాలయంలోని పుస్తకాలను ఒక్కొక్కరికి 5 నుంచి 10 ఇవ్వాలి. ఇచ్చిన పుస్తకాలను విద్యార్థి చదివేస్తే స్నేహితుల వద్దనున్న పుస్తకాలతో మార్చుకునేలా చూడాలి. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రజా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను తెచ్చుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈ పనులను రికార్డు చేయాలి. అధికారులు ఎప్పుడైనా పరిశీలిస్తే చూపించాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవేశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 5వ తరగతి పూర్తయినవారు ప్రభుత్వ బడుల్లో ఆరో తరగతిలో ప్రవేశించేలా చూడాలి. కింది తరగతుల్లోనూ విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి పెట్టాలి. పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి. పిల్లవాడి బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. వారే తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు సైతం వేసవి సెలవుల్లో తామేం చేశామో నోట్‌బుక్‌లో రాసి తరగతి ఉపాధ్యాయుడికి ఇవ్వాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలి. జగనన్న విద్యాకానుక కిట్లను వారు తీసుకెళ్లాలి.

వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 19న ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్‌ 10 వరకు అమలు చేయాలని సూచించింది. ఉపాధ్యాయులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని, వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను పోస్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పేర్కొంది.

* హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన.. వడగండ్ల హెచ్చరికలు జారీ

హైదరాబాద్‌: నగరాన్ని Hyderabad Rains మరోసారి వరుణుడు ముంచెత్తాడు. పొద్దుపొద్దున్నే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వాన నగరవాసుల్ని పలకరించింది..

రోడ్లు, లోతట్టు పప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి ఇలా.. నగరంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు వడగండ్ల వాన హెచ్చరికలూ జారీ చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జంట నగరాలు వానకి తడిచి ముద్దైంది. తెల్లవారినా కూడా మబ్బులు కమ్ముకుని చిమ్మచీకట్లు అలుముకోగా.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది. మరో మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్‌ రిపోర్ట్‌ చెబుతోంది..