NRI-NRT

వైభవంగా జరిగిన చికాగో ఆంధ్ర సంఘం వార్షిక వేడుకలు…

వైభవంగా జరిగిన చికాగో ఆంధ్ర సంఘం వార్షిక  వేడుకలు…

చికాగో ఆంధ్ర సంఘం (CAA)  సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 29వ తేదీన, యెల్లో బాక్స్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
 
 చైర్మన్ సుజాత అప్పలనేని, అధ్యక్షలు గౌరీశంకర్ అద్దంకి గారి నేతృత్వంలో, ఉపాధ్యక్షులు శ్వేత కొత్తపల్లి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా విచ్చేసి వీక్షించారు. 29 వ తేదీన చికాగో తెలుగు వారందరూ వయసుతో నిమిత్తం లేకుండా ఆనందోత్సాహాలతో కలసి ఈ వేడుకలను జరుపుకున్నారు. అనురాధ గంపాల, ప్రభాకర్  మల్లంపల్లి గారి ఆధ్వర్యంలో నిధి పాన్సే, లక్ష్మి అనుములషెట్టి, కిరణ్ వంకాయలపాటి, హేమంత్ తలపనేని, మురళి రెడ్డివారి, శ్రీకృష్ణ మతుకుమల్లి, చందు గంపాల, వైష్ణవి కొత్తమాసు, మయూఖ రెడ్డివారి, సభ్యత్వ నమోదు, రెజిస్ట్రేషన్ ఉత్సాహంగా నిర్వహించారు. మురళీ రెడ్డివారి  వెబ్ రెజిస్ట్రేషన్, క్యూఆర్ కోడ్ అందించి కార్యక్రమం సాఫీగా సాగేలా తోడ్పడ్డారు.
 
దీపప్రజ్వలన, ప్రార్ధనా గీతాలతో మొదలయి, తరువాత నాణ్యత, నవ్యత, వినోదం కలగలసిన ఎన్నో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆనందోత్సాహాలతో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గోన్నారు. శైలేష్ మద్ది, సాహితి కొత్త ఆద్యంతం జనరంజకంగా, సమయోచితంగా వ్యాఖ్యానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ విరాళాలతో సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్ల ను, గౌరీశంకర్ అద్దంకి, శ్వేత కొత్తపల్లి, వేదిక పైకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు.
 
ప్రతీయేటా ఆనవాయతీగా అందించే “లైఫ్ టైం అచీవ్మెంట్” పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ ఇంజనీరు శ్రీ రమణ మూర్తి యడవల్లి గారికి అందించి, వారిని వారి శ్రీమతిని వేదిక పైన శాలువ, పూలగుఛ్చాలు మరియు మెమెంటొతో సన్మానించారు. సిటీ ఆఫ్ చికాగో లో చీఫ్ ఇంజినీరుగా, డెప్యూటీ కమిషనరు గా 3 దశాబ్దాలు సేవలందించిన ఆయన తన 60 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో అందించిన అద్భుతమైన సేవలకు మరియు సాధించిన ఎన్నో నిర్మాణాత్మక విజయాలకు గాను ఆయన్ని ఈ సన్మాన సత్కారలతో గౌరవించారు CAA ట్రస్టీలు, అధ్యక్షులు మరియు డైరెక్టర్లు.
 
వాణి దిట్టకవి ,రాధికా గరిమెళ్ళ ఆధ్వర్యంలో, 35కు పైగా చికాగో ఆంధ్ర సంఘం టీం కలిసి కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారికి ఘననివాళిని అర్పించిన నృత్యనాటిక ప్రధానాకర్షణగా నిలిచింది. కేవలం సినీపరిశ్రమకే కాకుండా యావత్ కళాప్రపంచానికి తన చిత్రాల ద్వారా దర్శకులుగా మరియు దార్శనికులుగా నిలిచిన విశ్వనాథ్ గారికి స్మృత్యంజలి ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం.
 
ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలను కల్చరల్ టీం అనూష బెస్త, సౌజన్య రాళ్ళబండి, హరిణి మేడ, అద్భుతంగా సమన్వయించగా, సమన్వయ కర్తలుగా శ్రీనివాస పద్యాల, శిల్పా రామిశెట్టి, సృజన మన్నెడు సహకరాన్నందించారు.
 
సంస్థ యొక్క సేవావిభాగమైన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, మును ముందు చేపడుతున్న ప్రాజెక్ట్ లను సవితా మునగ మరియు సుచిత్ర తెల్లాప్రగడ వివరించారు.
 
సురేష్ కుమార్ ఐనపూడి, నరసింహారావు వీరపనేని, హేమంత్ తలపనేని ఆధ్వర్యంలో ‘బావర్చి రెస్టారెంట్’ వారు రుచికరంగా తయారుచేసిన “ఆంధ్రా విందు భోజనాన్ని”  సంఘ వ్వస్థాపకులు, సుందరవల్లి మల్లాది మరియు ఇతర  డైరెక్టర్లు , యువజన విభాగ సభ్యులు, ఎంతోమంది వాలంటీర్లు కొసరికొసరి వడ్డించారు.
 
గాయక, గాయనీమణులు అంజనా సౌమ్య, రేణుకుమార్, మణి తెల్లాప్రగడ, శ్రేయా అద్దంకి తమ అద్భుతమైన గాత్రంతో శ్రోతలకు వీనులవిందు చేసి, మంత్రముగ్ధులని చేసారు.

రవి తోకల, అన్వితా పంచాగ్నుల మున్నగు వారి నిర్వహణలో, సీతాకోకచిలుక మరియు రంగురంగుల పూలతోరణాల అలంకరణలతో ప్రాంగణం, ఫోటో బూత్ ఆహ్లాదకరముగా చూపరులని ఆకర్షించాయి. గిరిరావు కొత్తమాసు, రామరావు కొత్తమాసు కార్యక్రమo సాఫీగా సాగడానికి ఎంతో కృషి చేసారు. లక్ష్మీనాగ్ సూరిభొట్ల గారు తమ హాస్యస్ఫోరకమైన ప్రోమోలతో, హరిణి మేడ, మైత్రి అద్దంకి CAA యువజన విభాగం వారి చేత నటింపచేసిన సందేశాత్మక వీడియోలతో కార్యక్రమం జయప్రదం అయ్యేలా చేశారు .
 
స్వదేశ్ మీడియా నగేశ్ కండ్రేగుల, మరియు కాస్మోస్ డిజిటల్ సొల్యూషన్స్ సూర్య దాట్ల ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలనందించారు.

విజయ్ కొరపాటి, విష్ణు రెడ్డి, హరచంద్ గంపాల,సతీష్ దేవెళ్ల, శ్రీ హర్ష  గరికపాటి, విజయ్ దెందుకూరి, శ్రీకాంత్ కనాదిభట్ల, బోస్ కొత్తపల్లి, క్రిష్ణమోహన్ పిట్టల, శివ పసుమర్తి, సతీష్ పసుపులేటి, రాఘవ, సునీల్ ఆకుల, వెంకట్ యెడవల్లి, శ్రీ క్రిష్ణ, పద్మాకర్ దామరాజు, లోహిత గంపాల, ధృతి శిస్ట్లా, ధీరజ్ ఐనపూడి, గీతికా ఐనపూడి, యువ కటకం, స్మరణ్ తాడేపల్లి, సుజిత్, జయ్ అనికేత్ మేడబోయినె, వృషాంక్ కొరపాటి, నిఖిల్ యెడవల్లి, ఆశ్రిత్ కొత్తపల్లి, కల్యాణ్ కొత్తపల్లి, మయూఖ రెడ్దివారి, గాయత్రి గోలి, శ్రీక్షితా పెద్దమారు, రోషన్ పసుమర్తి, వైష్ణవి కొత్తమాసు, శ్రీయ కొంచాడ మున్నగు వాలంటీర్లు వారి చేయుతని అందించారు.  

అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి తన కృతజ్ఞతలను తెలుపగా, రామరావు కొత్తమాసు వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ట్రస్టీలు, గౌరీశంకర్ అద్దంకి గారి నేతృత్వంలో డైరెక్టర్లు, మరియు ఎంతోమంది వాలంటీర్లు శ్రమించారు.

అమెరికా, భారత దేశాల జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం సుసంపన్నమయింది.