Politics

Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి?

Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి?

భద్రత అనేది చాలా ముఖ్యం. అయితే మన దేశంలో రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జడ్ ప్లస్, జెడ్, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుంది. వీరిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాగే భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ బిఎస్ ధనోవాలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. వివిఐపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులకు మాత్రమే దేశంలోనే అత్యున్నత స్థాయి జడ్ ప్లేస్ భద్రత ఉండేది.

జడ్ కేటగిరి భద్రత:

జడ్ కేటగిరి భద్రత దళంలో 22 మంది ఉంటారు. వీరిలో నలుగురు ఐదుగురు ఎన్ఎస్జి కమాండోస్ కచ్చితంగా ఉంటారు. సెలబ్రిటీలకు, విఐపి లకు ఈ జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తారు. గతంలో బాబా రామ్ దేవ్, అమీర్ ఖాన్ లకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారు. మెరుగైన బద్ధత కోసం ఎస్కార్ట్ కారు కూడా అందుబాటులో ఉంటుంది.