DailyDose

రేపటిలోగా ఉద్యోగాల్లో చేరాలి..లేకపోతే తొలగిస్తాం..

రేపటిలోగా ఉద్యోగాల్లో చేరాలి..లేకపోతే తొలగిస్తాం..

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. తమను రెగ్యులరైజ్ చేయాలని గత కొన్ని రోజుల నుంచి జేపీఎస్లు సమ్మె చేస్తున్నారు. అయితే రేపు సాయంత్రం 5 గంటలలోపు ఉద్యోగంలో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ను కలిసి.. సమ్మె గురించి వివరించారు. ఈ భేటీ తర్వాత సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతోనే సమ్మెకు వెళ్లినట్లు జేపీఎస్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించకుండా..ఉద్యోగాల్లో చేరాలని ప్రభుత్వం హుకుం జారీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.