Movies

ఇండియాలో 60 కోట్లు కొల్లగొట్టిన ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఏకంగా 37 దేశాల్లో విడుదల..

ఇండియాలో 60 కోట్లు కొల్లగొట్టిన ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఏకంగా 37 దేశాల్లో విడుదల..

‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. వివాదాల మధ్య రిలీజ్ అయిన సినిమా! ఊహించని ఫలితాలు సాధిస్తుంది. చిన్న సినిమా గా రిలీజ్ అయినా పాన్ ఇండియాలో మోత మోగిస్తోంది. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని బాక్సాఫీస్ వద్ద మరోసారి రుజువు చేసింది. మే 5న రిలీజ్ అయిన సినిమాని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేసినా..రిలీజ్ అయిన ప్రతీచోటా సంచలనమే అవుతుంది.

కొన్ని రాష్ట్రాలు ఏకంగా పన్ను మినహాయింపు కూడా ఇచ్చి ప్రేక్షకులంతా..యువత అంతా తప్పక చూడాల్సిన సినిమా అని పెద్ద ఎత్తున ప్రచారం సైతం కల్పిస్తుంది. ఇప్పటివరకూ ఏ సినిమాకి ఏ ప్రభుత్వం ఇలాంటి ప్రచారం కల్పించలేదు. తొలిసారి ఆ తరహా ఘతన సాధించిన చిత్రంగానూ కేరళ స్టోరీ నిలిచింది. ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది.

కేవలం వారం రోజుల్లోనే ఈ రేంజ్ లో వసూళ్లు సాధించింది. సినిమాకి ఆద్యంతం పాజిటివ్ టాక్ రావడంతో డై బై డే వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. మెట్రో పాలిటన్ సిటీస్ లో టిక్కెట్ దొరకడమే కష్టంగా మారింది. ఇంకా చిన్న చిన్న పట్టణాల్లో సినిమా అందుబాటులో లేకపోవడం సినిమాకి మైనస్ గా కనిపి స్తుంది. తక్షణం థియేటర్లు పెంచాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ ని సైతం షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఈనెల 12న ఏకంగా 37 దేశాల్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి ఆదాశర్మ తెలిపింది. దీంతో ఈ సినిమా ఇండియన్ సినిమా రిలీజ్ ల్లో ఓ కొత్త రికార్డును నమోదు చేస్తున్నట్లు అయింది. ఇంతవ రకూ ఏ భారతీయ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవ్వలేదు.

‘బాహుబలి’..’ఆర్ ఆర్ ఆర్’..’కేజీఎఫ్’. .’దంగల్’ లాంటి బ్లాక్ బస్టర్లు కూడా ఈ రేంజ్లో రిలీజ్ కాలేదు. కానీ ‘కేరళ స్టోరీ’ అంతకు మించి అని ప్రూవ్ చేస్తుంది. సుదిప్తో సేన్ దర్శకత్వం వహించి ఈ సినిమాని విపుల్ షా నిర్మించారు.