WorldWonders

లోకల్ ట్రైన్ లో కత్తులతో హల్ చల్…

లోకల్ ట్రైన్ లో కత్తులతో హల్ చల్…

చెన్నై లోకల్ ట్రైన్లో కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. తిరువళ్లూరు వెళ్లే లోకల్ ట్రైన్లో కత్తులతో స్టంట్లు చేశారు. హిందూ, పచ్చయప్పన్ కాలేజీలకు చెందిన విద్యార్థులు బలప్రదర్శన చేశారు. దీంతో ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.