Politics

టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం….

టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం….

నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటనపై టీడీపీ అగ్రనాయకత్వం తీవ్రంగా స్పందించింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి వైసీపీ మూకల పనే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతాం అని లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన ఇచ్చారు