Business

నిలకడగా బంగారం ధర… రూ.500 పెరిగిన వెండి-TNI నేటి వాణిజ్య వార్తలు

నిలకడగా బంగారం ధర… రూ.500 పెరిగిన వెండి-TNI నేటి వాణిజ్య వార్తలు

తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది.వానలు లేకపోవడం, ఎండలు మండిపోవడమే విద్యుత్ డిమాండ్ పెరగడానికి ప్రధానంగా కారణంగా తెలుస్తోంది.వాస్తవానికి జూన్ నెలలో రోజూవారి విద్యుత్ వినియోగం 9వేల మెగావాట్లకు మించి ఉండదని గణాంకాలు చెబుతున్నాయి.అయితే గతానికంటే భిన్నంగా మంగళవారం ఒక్కరోజే దాదాపు 11, 241 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
2022లో జూన్ 20న విద్యుత్ వినియోగం కేవలం 8,344 మెగావాట్లు మాత్రమే ఉండటం గమనార్హం.

ఓలా నుంచి త్వరలోనే మరో కొత్త స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం త్వరలోనే మరో స్కూటర్ ను పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని ఓలా కంపెనీ స్వయంగా ప్రకటించింది. వచ్చే నెలలోనే ఈ స్కూటర్ ను విడుదల చేయనుండడంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఓలా మూడు రకాల స్కూటర్ వేరియంట్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ప్రో, ఎలా ఎస్1, ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా పాప్యులర్ అయినది ఎస్1 ప్రో మోడల్.

నిలకడగా బంగారం ధర… రూ.500 పెరిగిన వెండి

ముంబై – నేడు, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ 70, స్వచ్ఛమైన పసిడి ధర రూ 70 చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు రూ 500 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 60,000 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ 78,600 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ 55,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ 60,000 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ 78,600 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది

* తెలంగాణ తలసరి ఆదాయంలో రికార్డ్

తెలంగాణా ప్రజల తలసరి ఆదాయం ఇలా రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రాథమిక రంగం ఎంతో సహకరించింది. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, అటవీ, ఫిషరీస్ విభాగాలు. వీటి నుంచి 2014-15 లభించిన సహకారం 19.5% తో పోలిస్తే.. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23లో 21.1% గా ఉంది. 2022-23లో ప్రాథమిక రంగం వృద్ధి రేటు 2014-15లో దాని వృద్ధి రేటు కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దీనికి ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలు కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవసాయం పై పెట్టిన ఫోకస్ సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పవచ్చు.ఇక సెకండరీ సెక్టార్ అంటే తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా,ఇతర యుటిలిటీస్ నుంచి కూడా లభించిన సహకారం దేశంలోనే టాప్ స్థాయిలో తెలంగాణా నిలబడటానికి ఊతం ఇచ్చింది. ప్రస్తుత ధరల ప్రకారం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు అత్యధికంగా నమోదయ్యాయి. సెకండరీ సెక్టార్‌లోని అన్ని సబ్ సెక్టార్‌లలో 2014-15 నుంచి 2022-23 వరకు 186.2% వృద్ధి రికార్డ్ అయింది.

త్వరలోనే ఇండియా రోడ్లపై ఏసీ ట్రక్కులు

ప్రస్తుతం ఇండియన్ రవాణాలో ట్రక్కులు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పక్క రాష్ట్రాలకు ఎగుమతి, దిగుమతి వంటి విషయాల్లో ట్రక్కులదే కీలక పాత్ర. అందుకే 2025లోపు ప్రతీ ఇండియన్ ట్రక్కులో డ్రైవర్ కంపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా ఉండాలని, అంతే కాకుండా అందులో ఏసీ కూడా ఉండాలని నితిన్ గడ్కరి ప్రకటించారు. తను మినిస్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఏసీ ట్రక్కులను ప్రవేశపెట్టాలనేది తన కల అని తాజాగా పాల్గొన్న ఒక ఈవెంట్‌లో బయటపెట్టారు.

ఐదో రోజుతో 395 కోట్లు రాబట్టిన ఆదిపురుష్

భారీ అంచనాల మధ్య ఈ నెల 16వ తేదీన ‘ఆదిపురుష్’ విడుదలైంది. చాలా గ్యాప్ తరువాత రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. తొలి రోజునే ఈ సినిమా 140 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండోరోజున 240 కోట్లకు .. మూడో రోజున 340 కోట్లకు వసూళ్లు చేరుకున్నాయి. అయితే 4వ రోజు నుంచి వసూళ్లలో తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. 4వ రోజుతో కలుపుకుని 375 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, 5 రోజుతో 395 కోట్లకు చేరుకుంది. 6వ రోజుతో ఈ సినిమా 400 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమనే చెప్పాలి. ఇలా చూసుకున్నా ఈ వారాంతానికి ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రూ.3,497 కోట్లతో సర్కారు బడుల్లో ఆధునిక వసతులు: సబిత

TS: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే అనేక స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రాష్ట్రంలోని 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. సకల హంగులతో తీర్చిదిద్దిన వెయ్యి సర్కారు బడులను దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

ఐఐటీ బాంబేకు నందన్ నీలేకని రూ.315 కోట్ల భూరి విరాళం

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఛైర్మన్ నందన్ నీలేకని మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తాను చదువుకున్న ఐఐటీ బాంబేకు రూ.315 కోట్ల భూరి విరాళం ఇచ్చారు. ఈ నిధులను ఐఐటీలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇంజినీరింగ్, టెక్నాలజీలో పరిశోధనలకు వినియోగించాలని కోరారు. గతంలోనూ ఐఐటీ బాంబేకు నందన్ నీలేకని రూ.85 కోట్లు విరాళం ఇచ్చారు. నీలేకని 1973లో ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

ఇవాళ, రేపు కొన్ని రైళ్లు రద్దు

నేడు ఏకంగా ఏడు రైళ్లను రద్దు చేయగా, రేపు మూడు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. నేడు షాలిమార్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-షాలిమార్ (18045/18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు కాగా, రేపు సికింద్రాబాద్-అగర్తల (07030), గువాహటి-సికింద్రాబాద్ (02605) ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేశారు. అలాగే, సంత్రగచ్చి-తిరుపతి, తిరుపతి-సంత్రగచ్చి (22855/22856) రైళ్లతోపాటు మరికొన్ని రైళ్లు కూడా రద్దయ్యాయి.

* బిల్లు కట్టకుండానే 603 రోజులు 5-స్టార్‌ హోటల్‌లో.. చివరకు ఏమైందంటే

ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో (5-star Hotel) ఒకరోజు ఉండాలన్నా సామాన్యులకు ఖరీదైన వ్యవహారం. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా ఏడాదిన్నరకు పైగా ఉన్నాడు. అదీ బిల్లు చెల్లించకుండానే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ వ్యవహారంపై తాజాగా దిల్లీలోని ‘ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ (IGI) ఎయిర్‌పోర్ట్‌’ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది