Agriculture

తెలంగాణ గిరిజనులకు శుభవార్త. పోడు భూముల పట్టాలు పంపిణీ

తెలంగాణ గిరిజనులకు శుభవర్త. పోడు భూముల పట్టాలు పంపిణీ

గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోడు భూముల పట్టాల పంపిణీ ప్రారంభానికి ముహుర్తం ఖరారు చేశారు. పోడు భూముల పట్టాల పంపిణీ చేయనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి జూన్‌ 24 నుంచే (ఈరోజు) పట్టాల పంపిణీ చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ తాజాగా ఈ తేదీని మార్చారు. జూన్‌ 30వ తేదీ నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఈ విషయమై కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 30వ తేదీన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీని చేపట్టనున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీకి మార్చినట్లు అధికారులు తెలిపారు.నేడు తెలంగాణలో జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి శుక్ర, శనివారాల్లో జిల్లా కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29 న బక్రీద్ పండుగ కూడా ఉండడం.. వీటన్నింటీన దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని జూన్‌ 30కి మార్చనున్నారు. ఇక 30వ తేదీన ఆసిఫాబాద్‌ పర్యటన వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. అసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.