WorldWonders

ఈ పొట్టేలును కోటి రూపాయలుకు ఎందుకు ఇవ్వలేదో తెలుసా?

ఈ పొట్టేలును కోటి రూపాయలుకు ఎందుకు ఇవ్వలేదో తెలుసా?

బక్రీద్ పండుగ వేళ ఓ గొర్రె రూ.కోటి ధర పలికింది. అయితే ఆ గొర్రెను మాత్రం అమ్మడానికి దాని ఓనర్ నిరాకరించాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని చురూ జిల్లాకు చెందిన రాజు సింగ్ అనే రైతుకు సంబంధించిన గొర్రెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బక్రీద్ పండుగ సందర్భంగా ఆ గొర్రెను చాలా మంది కొనడానికి ఎగబడ్డారు. ఒకరు రూ.10 లక్షలు, మరొకరు రూ.20 లక్షలు, ఇంకొకరు ఏకంగా రూ. కోటి వెచ్చించి ఆ గొర్రెను కొనడానికి ముందుకు వచ్చారు. దీంతో ఆ గొర్రె, రైతు రాజు సింగ్ వార్తల్లో నిలిచారు.అసలు ఆ గొర్రెకు అంత ధర పలకడానికి ప్రధాన కారణం.. ఆ గొర్రె పొట్ట భాగంలో ఉర్దూలో 786 నెంబర్ ఉండటం. ఇక 786 ముస్లింలకు పవిత్రమైన నెంబర్ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ గొర్రెకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే రైతు మాత్రం తన గొర్రెను అమ్మడానికి ఇష్టపడలేదు. అది తనకు చాలా ఇష్టమైన గొర్రె అని, అందుకే అమ్మలేదని చెప్పాడు.