Politics

గడ్కరీతో ఏపీ మంత్రి రోజా భేటీ

గడ్కరీతో  ఏపీ మంత్రి రోజా భేటీ

కేంద్ర మంత్రి గడ్కరీతో రోజా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి గడ్కరిని తిరుమల శ్రీపద్మావతి అతిధి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసారు రోజా. ఈ సందర్భంగా వారికి చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారి పై సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని ఓ పోస్ట్‌ ద్వారా తెలిపారు. పుత్తురు నుండి తమిళనాడు తిరుత్తణి కి ఫోర్ లైన్ పనులు త్వరితగతిన పూర్తి చెయ్యమని తద్వారా ప్రమాదాలు పూర్తి నివారించవచ్చు నని కోరడం జరిగిందని చెప్పారు.నియోజకవర్గం లో జాతీయ రహదారి పై వాహనాల రాక పోకలు ఎక్కువ ప్రమాదాల సంఖ్యకూడా ఎక్కువే ముఖ్యంగా రామానుజపల్లి జంక్షన్ – చిగురువాడ క్రాస్ మరియు తిరుపతి క్రాస్ అత్యంత ప్రమాదకరమైనది అంచేత అక్కడ అండర్ పాస్ సౌకర్యం కల్పించగరని రోజా కోరారట. చిత్తూరు తిరుపతి తరహాలో కల్లూరు నుండి రేణిగుంట జంక్షన్ కూడా సిక్స్ లైన్ రోడ్డు ఎర్పాటు చేస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని.. జాతీయ రహదారి పై హెచ్చరిక బోర్డులు బటర్ ఫ్లయ్ లైట్లు ఏర్పాటు చెయ్యాలని‌ కోరారు రోజా. రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి NH71 పై కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది, సర్వీస్ రోడ్డు వెంటనే ఏర్పాటు చెయ్యాలన్నారు. ఏపి‌ లో ఉన్నటువంటి జాతీయ రహదారి కి సంబందించిన కార్యాలయాలు తమిళనాడు లో ఉండటం వల్ల ఇక్కడి ప్రజలకి తీవ్రమైన అసౌకర్యం కలుగుతోంది ఇదివరకు అలాంటి ఘటనలు పలుమార్లు జరిగాయి. అంచేత అవన్నీ ఏపి‌ హైవే అథారిటీ వారి ఆద్వర్యంలో ఉండేలా చూడగలరని విన్నవించారు.