Sports

సహజ శైలిలోనే ఆడమని ప్రోత్సహించిన ద్రవిడ్

సహజ శైలిలోనే ఆడమని ప్రోత్సహించిన ద్రవిడ్

ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు జితేశ్‌ శర్మ ఓసారి టీమిండియాకు ఎంపికైన తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. శ్రీలంకతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఈ విదర్భ బ్యాటర్‌కు పిలుపు వచ్చింది. ఆసియా క్రీడలు-2023 సందర్భంగా మరోసారి అదృష్టం జితేశ్‌ తలుపుతట్టింది. చైనాలో జరుగునున్న ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననున్న భారత ద్వితీయ శ్రేణి జట్టులో అతడికి చోటు దక్కింది. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించాడు.

‘‘జితేశ్‌.. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావో తెలుసా?’’ అని ద్రవిడ్‌ అడిగారు. అందుకు బదులుగా.. ‘‘వీలైనంత ఎక్కువ స్ట్రైక్‌రేటు నమోదు చేయడం నా బలం. త్వరత్వరగా పరుగులు రాబడతాను. అందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు’’ అని సమాధానమిచ్చాను.

దానికి ప్రతిగా రాహుల్‌ కూడా.. ‘‘అవును.. నువ్వు ఇక్కడిదాకా వచ్చింది అందుకే! నీదైన శైలిలో ఆడు.. జట్టు కోసం ఆడు.. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు’’ అంటూ 29 ఏళ్ల జితేశ్‌ డ్రెస్సింగ్‌రూం అనుభవాలు పంచుకున్నాడు.