Food

కొబ్బరి నూనెతో వంట చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

కొబ్బరి నూనెతో వంట చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

కొబ్బరినూనెతో వంట అనగానే ఛీ అలా ఎవరు తింటారు అనుకున్నారు కదూ. కానీ.. మనం రోజూ వంటల్లో వాడే సన్ ఫ్లవర్, పామాయిల్, వేరుశెనగ నూనెల కంటే.. కొబ్బరినూనెతో తయారు చేసే వంటతినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కేరళ రాష్ట్రం వైపు ఎక్కువగా కొబ్బరినూనెనే వంటలో వాడుతారు. ఇందులో 90 శాతం సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇతర వంట నూనెలల్లో ఇవి నామమాత్రంగానే ఉంటాయి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఊబకాయాన్ని తగ్గించడంలో కొబ్బరినూనెకు సాటి మరొకటి లేదు. సోయాబీన్ నూనెతో పోల్చితే.. కొబ్బరినూనెకే కొవ్వును కరిగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పొట్టను తగ్గించడంలో కొబ్బరినూనె సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

కొబ్బిరి నూనె వంటలో ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కొబ్బరినూనెలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అలాగే కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి.

మూర్ఛ, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించాలంటే.. కొబ్బరినూనెతో చేసిన వంటకాలు తినడం మంచిది. అలాగని రెండు, మూడు గరిటల నూనెను ఒకేసారి వాడకూడదు. ఒకటిరెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వినియోగించి ఆహారాన్ని తయారు చేసుకోవాలి.

కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ దంతాల పటుత్వాన్ని పెంచుతాయి. ముఖ్యంగా మెదడు పనితీరును కొబ్బరి నూనె మెరుగుపరుస్తుంది. అందుకే కొబ్బరినూనెతో చేసిన వంటకాలు తినేవారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.