Movies

మురుగదాస్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్

మురుగదాస్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్.. ఈ భామ సీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.మృణాల్ తన మొదటి సినిమాతో నే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది.ఇలా నటిగా మంచి పేరు సంపాదించుకన్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ సినిమాలతో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగులో ఈమె నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.ఈ సినిమా తో పాటు తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి మరొక సినిమా లో కూడా నటిస్తుంది.ఈ సినిమా కూడా షూటింగ్ దశలో వుంది.ఇలా తెలుగులో వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీ గా ఉంది ఈ భామ ..

ఇదిలా ఉండగా తాజాగా ఈమె కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటున్నట్లు సమాచారం.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఈమె నటించే అవకాశాన్ని అందుకున్నట్టు సమాచారం. మురగదాస్ దర్శకత్వంలో హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న ఓ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం శివ కార్తికేయన్ కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమాను చేస్తున్నారు. అందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మురుగదాస్ డైరెక్షన్లో సినిమా సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ను తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది