Agriculture

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యపేట, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు అధికారులు ఎల్లో, గ్రీన్ అలర్ట్ ను జారీ చేశారు. ఇక మంగళవారం రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. జనగాం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసాయి. వరంగల్ లో 49.3 మిమీ, మహబూబాబాద్ లో 32.3 మిమీ, నల్గొండలో 30.8 మిమీ వర్షపాతం నమోదయింది. హైదరాబాద్ నగరంలోను పలుచోట్ల వర్షం కురిసింది.