Food

7 గంటల లోపు భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు

7 గంటల లోపు భోజనం చేస్తే  కలిగే ప్రయోజనాలు

మన జీవితంలో ఏ పనైనా సక్రమంగా చేస్తేనే అన్ని విధాల బాగుంటుంది. ముఖ్యంగా ఆహార విషయంలో సమయపాలన తప్పనిసరి. సమయానికి ఆహారం తింటే జీవితకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రస్తుత సమాజంలో బిజీ లైఫ్ రీత్యా సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. అలాంటివారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
ముఖ్యంగా రాత్రి సమయంలో భోజనం 7 గంటల లోపే చేయాలి. మరి సమయం ఎక్కువైతే ఒక గంట అటు ఇటు 8 గంటల లోపు చేయాలి. ఎక్కువసేపు సమయం గడిపితే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. 7 గంటల లోపు భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు.. ముఖ్యంగా మలబద్ధకం,అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.

అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల ప్రశాంతమైన నిద్రపోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు ఏడు గంటల లోపు తినడానికి అందరూ ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.