DailyDose

శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!

శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!

భారతదేశమంటేనే ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. దేవుళ్లను ఎక్కువగా నమ్ముతారు. అలాంటి ఈ దేశంలో శ్రావణమాసం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. శ్రావణమాసంలో చాలామంది మాంసాహారాలకు దూరంగా ఉంటారు. అలాంటి ఈ శ్రావణంలో మాంసాహారం ఎందుకు తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రావణమాసం వచ్చిందంటే చాలు హిందూ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో నియమాలు పాటిస్తారు. పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉండి శాకాహారమే తింటుంటారు. మరి అలాంటిది శ్రావణంలో మాంసాహారం ఎందుకు తినకూడదో ఒక ప్రత్యేకమైనటువంటి రీజన్ ఉందట.

సైన్స్ ప్రకారం చూస్తే శ్రావణంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయదు. కాబట్టి మాంసం ఉండే పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని మాంసానికి దూరంగా ఉంటారట. ఇక శాస్త్ర పండితులు చెప్పిన దాని ప్రకారం శ్రావణమనేది దేవుళ్లకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనం అనుకున్నది నెరవేరుతాయట. కాబట్టి ఈ మాసంలో మాంసం తినకూడదని , జంతు వద చేయకూడదని అంటుంటారు.