ScienceAndTech

NASA: అంతరిక్షంలో వయస్సు పెరగదు

NASA: అంతరిక్షంలో వయస్సు పెరగదు

గడచిన కొన్ని దశాబ్దాలుగా పలుదేశాలు తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాయి. వారు అంతరిక్షంలో కొన్ని రోజులు గడిపి, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కాగా అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములలో పలు మార్పులు కనిపించాయి. వారికి సంబంధించిన అధ్యయనాన్ని నాసా చేపట్టింది. అంతరిక్షం నుంచి వచ్చిన వారిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో గమనించింది. అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములలో రక్తహీనత సర్వసాధారణం. దీనిని స్పేస్ అనీమియా అని కూడా అంటారు. అంతరిక్షంలోకి వెళ్లాక వారి వృద్ధాప్యం నిజంగానే నెమ్మదిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఇందుకోసం నాసా ఒక పరీక్ష చేసింది. పరిశోధకులు ఇద్దరు కవల సోదరులను ఎంపికచేశారు. ఈ సోదరులిద్దరూ వ్యోమగాములు. వారిలో ఒకరిని అంతరిక్షంలోకి పంపారు. మరొకరిని భూమిపై ఉంచారు. స్కాట్ కెల్లీ 340 రోజులు అంతరిక్షంలో గడిపాడు. అతని కవల సోదరుడు మార్క్ భూమిపైనే ఉన్నాడు. స్కాట్ కెల్లీ అంతరిక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతని జన్యువులలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. భూమిపై జరగని కొన్ని మార్పులు అతని డీఎన్‌ఏలో కనిపించాయి. స్కాట్ తన సోదరుడు మార్క్ కంటే చిన్నవాడిగా కనిపించడానికి ఇదే కారణంగా నిలిచింది. అయితే తరువాతి 6 నెలల్లో స్కాట్ కెల్లీ జీన్స్‌లో మార్పు సాధారణ స్థితికి చేరుకుంది. దీని ప్రకారం చూస్తే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్నవారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా వారు యవ్వనులుగా కనిపించేందుకు అవకాశాలున్నాయి.