పీవీ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్.. చంద్రబాబు హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ఈ స్కిల్ స్కామ్ డొంక మొత్తం కదిలింది. అవును, టోటల్ స్కిల్ స్కామ్ ఎపిసోడ్‌లో అత్యంత కీలకంగా మారారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేష్. ఆనాడు ఏపీ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్.. సీమెన్స్‌కి నిధులు విడుదల చేసేందుకు నిరాకరించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని వారించారు. ఆ మేరకు సీఎస్‌కు లేఖ కూడా రాశారు. సీమెన్స్‌కి నిధులు రిలీజ్ చేయొద్దని సూచించారు. ఇదే విషయాన్ని సీఐడీ విచారణలో స్టేట్‌మెంట్‌గా ఇచ్చారు పీవీ రమేష్.
పీవీ రమేష్ స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై అభియోగాలు నమోదుచేసింది సీఐడీ. బాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్టు సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు పీవీ రమేష్. అందుకే, ఈ స్కామ్‌లో ప్రధాన లబ్దిదారు చంద్రబాబే అంటోంది సీఐడీ. అంతేకాదు, ఈ కేసులో చంద్రబాబును A37నుంచి A1గా మార్పులుచేసింది.
పీవీ రమేష్ వైసీపీ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. పుణెలో స్కామ్ లింకులు బయటపడ్డాక రమేష్‌ను విచారించింది సీఐడీ. సీమెన్స్ ప్రతినిధులను కూడా విచారించింది సీఐడీ. పీవీ రమేష్ అప్రూవర్‌గా మారడంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డొల్ల కంపెనీల లింక్‌లు, ఆధారాలు సేకరించింది సీఐడీ. ఈ ఆధారాలను బేస్ చేసుకునే చంద్రబాబు విషయంలో సీఐడీ దూకుడు పెంచింది.