Devotional

మెట్ల మార్గంలో తగ్గిన రద్దీ. అసలెన్ని చిరుతలు ఉన్నాయి?

మెట్ల మార్గంలో తగ్గిన రద్దీ. అసలెన్ని చిరుతలు ఉన్నాయి?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. తెలుగు రాష్ట్రాల నుంచిమాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారిని దర్శనానికి చేరుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటన దృష్ట్యా తిరుమల కొండపై దైవ దర్శనం కోసం వెళ్లాలంటే జంకే పరిస్థతి నెలకొంది. కాలినడక భక్తుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉంది. ఉన్నవారంతా వాహనాలను ఆశ్రయిస్తూ కొండపైకి చేరుకుంటున్నారు.

అలిపిరి కాలినడక మార్గమంటేనే ఇప్పుడు టెర్రర్‌గా మారింది. కొండపైకి వెళ్లేందుకు భక్తులు వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. కాలినడకన వెళ్తే దర్శనభాగ్యం అద్భుతంగా ఉంటుందన్న సెంటిమెంటును పక్కనబెట్టారంటే.. అది చిరుత దయవల్లే. జూన్‌ చివరి వారంలో ఓ బాలుడిపై చిరుత దాడి ఘటన భక్తులను ఆందోళనకు గురిచేసింది. అప్పటి నుంచి అటు అధికారులు.. ఇటు భక్తుల కంటిమీద కునుకు లేదు.దీంతో అలర్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం.. మెట్ల మార్గంలో ఆంక్షలు విధించింది.

అటు ఆంక్షలు కొనసాగుతుండగానే.. ఇటు బోన్లు ఏర్పాటు చేసిన ఫారెస్ట్‌ అధికారులు.. చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అనుకున్నట్లుగానే.. చిరుతలు బోనుకు చిక్కాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు చిరుతలు బోనులోకి వచ్చి పడ్డాయి. ఇక్కడే చాలా మందికి ధర్మసందేహం మొదలైంది. అసలు కొండపైన ఎన్ని చిరుతలున్నాయి? వాటిలో మ్యాన్‌ఈటర్‌గా మారిన ఆ కౄర మృగమేది? ఇప్పటివరకు చిక్కిన చిరుతల్లో లక్షితను చంపిన మృగముందా? దీనిపై ఫారెస్ట్‌ అధికారులు స్టడీ చేస్తున్నారు.