Sports

యుఎస్ ఓపెన్ మహిళల విజేతగా కోకో గాఫ్

యుఎస్ ఓపెన్ మహిళల విజేతగా కోకో గాఫ్

యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌ విజేతగా అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో బెలారస్‌కు చెందిన సెకెండ్‌ సీడ్‌ అరీనా సబలెంకాను ఓడించి తొలి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను గాఫ్‌ కైవసం చేసుకుంది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 2-6, 6-3, 6-2 తేడాతో 19 ఏళ్ల కోకో గాఫ్‌ ఓడించింది.