NRI-NRT

వాషింగ్టన్ డీ.సిలో NRITDP కొవ్వొత్తుల ర్యాలీ

వాషింగ్టన్ డీ.సిలో NRITDP కొవ్వొత్తుల ర్యాలీ

చట్టాన్ని పాటిస్తూ న్యాయస్థానం సాక్షిగా మా న్యాయ పోరాటం:

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, జాతీయ నేతగా, దార్శనికుడిగా పేరు గడించిన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేయటం, అవలంబించిన తీరు పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి కాలరాయటమేనని ప్రవాస భారతీయులు, వారి తల్లి దండ్రులు ఖండిస్తూ.. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్త బంద్ కు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేసారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సి పరిధిలో సతీష్ వేమన ఆధ్వర్యంలో జరిగిన ఈ కొవ్వొత్తి రాలీ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు, వారి తల్లి దండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అవలంబిస్తున్న కక్ష పూరిత విధానాలను నిర్ద్వన్ద్వంగా ఖండించారు.

సతీష్ వేమన మాట్లాడుతూ.. 73 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు గారు తనపై వచ్చిన ఆరోపణలకు, ఒక సామాన్య పౌరునిగా పోలీసు వ్యవస్థకు సహకరించి , చట్టాలను గౌరవిస్తూ..న్యాయస్థానం సాక్షిగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని.. నిజానిజాలు త్వరలోనే తేలుతాయని.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు తోనే ఎల్లప్పుడూ ఉంటారని తెలిపారు.

భాను మాగులూరి,యాష్ బొద్దులూరి మాట్లాడుతూ చంద్రబాబు గారి ఔన్నత్యం, క్రమశిక్షణ, నిబద్దత కోట్లాది మంది తెలుగువారు 45 సంవత్సరాలుగా చూస్తున్నారని, కానీ అరెస్ట్ జరిగిన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ అన్నివర్గాల సమున్నత వేదిక అని.. ఎన్నో ఓడిదుడుకులని ఎదుర్కున్న సమర్థులు చంద్రబాబు నాయకత్వానికి ప్రజలు పట్టం కడతారని తెలిపారు.

సాయి బొల్లినేని, రవి అడుసుమిల్లి తదితరులు మాట్లాడుతూ ఈ కఠిన సమయంలో కార్యకర్తలు సంయమనం పాటిస్తూ..నాయకునికి అండగా నిలుస్తామని. ప్రజలు విజ్ఞులని.. సమర్ధ నాయకుని ఎన్నుకుంటారని.. జై చంద్రబాబు అని నినదించారు.. ఈ కార్యక్రమంలో సుశాంత్ మన్నే, నెహ్రు, పుల్లారెడ్డి, రమేష్ గుత్తా, మాల్యాద్రి, భాను వలేటి, సామంత్, పవన్,మురళి, వినీల్, జాఫర్, అమ్మిరాజు, కాంతయ్య, సురేష్, సత్యనారాయణ, బసవరావు, యుగంధర్, మాధవరావు పాల్గొన్నారు.