Politics

భాజపా – జేడీఎస్‌ పొత్తు..

భాజపా – జేడీఎస్‌ పొత్తు..

‘బెస్ట్ ఆఫ్ లక్‌’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు!

కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ పార్టీ (JDS Party) భాజపా (BJP)సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో శుక్రవారం అధికారికంగా చేరింది. దీంతో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరుపార్టీల పొత్తుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ దీనిపై స్పందించారు. క్యాబినేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ భాజపా – జేడీఎస్‌ ప్రభుత్వాలకు బెస్ట్ ఆఫ్‌ లక్‌ చెబుతున్నా’అని అన్నారు.

భాజపా – జేడీఎస్‌ పొత్తుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం కూడా స్పందిస్తూ.. ‘ కర్ణాటక ప్రజలు సంప్రదాయవాద, తిరోగమన పార్టీల మధ్య ఈ పొత్తును కచ్చితంగా గమనించాలి. చాలా కాలంగా అనుమానిస్తున్న నిజం వెలుగులోకి వచ్చింది. జేడీఎస్‌ను ఎన్డీయే అధికారికంగా స్వాగతించింది’ అని ఎక్స్‌ (ట్విటర్) లో పేర్కొన్నారు.

జేడీఎస్‌ (JDS) 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రభుత్వంలో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటివరకు భాజపా, కాంగ్రెస్‌ తో విడివిడిగా ఉన్న జేడీఎస్‌ 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి తన వ్యూహాన్ని మార్చింది.