Business

ఉద్యోగులకు మళ్లీ షాక్ ఇచ్చిన అమెజాన్- వాణిజ్య వార్తలు

ఉద్యోగులకు మళ్లీ షాక్ ఇచ్చిన అమెజాన్- వాణిజ్య వార్తలు

*  హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు షాకిచ్చింది.   తాజా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ కీలక వడ్డరీట్లను యథాతథంగా ఉంచినప్పటికీ  బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను సైలెంట్‌గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) గరిష్టంగా 10 పాయింట్ల  బేసిస్‌ పాయింట్ల  వరకు పెంచింది.బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్‌మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి.ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 bps 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానిచేరింది మూడు నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్‌ఆర్‌ 9.25 శాతంగా ఉంటుంది. 

*   ఉద్యోగులకు మళ్లీ షాక్ ఇచ్చిన అమెజాన్

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గతంలో ఎంతో మందిని ఉద్యోగాల నుంచి తీసేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.గ్లోబల్ కమ్యూనికేషన్స్‌ కీలకమైన విభాగాల్లో ఈ లేఆఫ్‌లను ప్రకటించింది..నివేదికల ప్రకారం.. దేశీయ, అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ విభాగాలలో దాదాపు 5 శాతం ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ప్రైమ్ వీడియో, మ్యూజిక్‌ సహా కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగాలను ఇది ప్రభావితం చేయనుందని డెడ్‌లైన్‌ రిపోర్ట్‌ చేసింది. ప్రభావిత ఉద్యోగులకు 60 రోజుల వ్యవధిలో వారి రెగ్యులర్ జీతం, ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే తొలగించిన ఉద్యోగులు విభజన ప్యాకేజీలు మరియు పరివర్తన ప్రయోజనాలు, ఉద్యోగ నియామకంలో సహాయం కోసం అర్హులు.. అమెజాన్ స్టూడియోస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వర్టికల్స్‌కి సంబంధించిన కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఇటీవల భారీగా ఉద్యోగాలను తొలగించిన సంగతి తెలిసిందే..ఒక్క అమెజాన్ మాత్రమే కాదు.. చాలా కంపెనీలు ఉద్యోగాలకు కోతలను విధించింది..టెక్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా వేలాదిమందిని ఉద్యోగులనుంచి తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అమెజాన్‌ 2022 నుంచి జనవరి 2023 మధ్య కాలంలో 18వేలమందిని తొలగించింది. క్లౌడ్ కంప్యూటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, అడ్వర్టైజింగ్ చ ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్వంటి రంగాలపై దృష్టి సారించి, అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో, గ్రాసరీ విభాగాల్లో మరికొంతమందిని తీసివేసింది..ఇకపోతే ఈ ఏడాది మార్చిలో 9వేల మందిని తొలగించింది. దాదాపు 27 వేల మందిని తొలగించడం కష్టమైనదే అయినప్పటికీ కంపెనీ మంచి ఫలితాన్నిస్తుందని కంపెనీ హెడ్సె తెలుపుతున్నారు..

* నేడు సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత మొత్తానికి గృహ వినియోగ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచారు.హైదరాబాద్: రూ. 966.వరంగల్: రూ.974.విశాఖపట్నం: రూ. 912.విజయవాడ: రూ. 927.గుంటూర్: రూ. 944

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 65,512కి పడిపోయింది. నిఫ్టీ 141 పాయింట్లు కోల్పోయి 19,512 వద్ద స్థిరపడింది. ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధ ప్రభావం మార్కెట్లపై పడింది. చమురు ధరలు పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై దీని ప్రభావం ఉంది. 

9 శాతం తగ్గిన ఐటీ ఉద్యోగాల నియామకాలు

నౌకరీ డాట్ కామ్ నెలవారీ ‘నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్’ నివేదిక ప్రకారం, ఐటీ, బీపీఓ లేదా ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీతో సహా రంగాలలో ప్రతికూల ధోరణిని అనుసరించి, సెప్టెంబర్‌లో వైట్ కాలర్ నియామకాలు 8.6 శాతం వార్షిక క్షీణతను చవిచూశాయి. రీసెంట్ గా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నెలవారీ ఉద్యోగ నియామకాల్లో దాదాపు 6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు సూచించింది.సెప్టెంబర్‌లో 2వేల 835 వైట్‌కాలర్ జాబ్ పోస్టింగ్‌లు జరిగాయని, గతేడాది ఇదే నెలలో 3వేల 103 ఉద్యోగాలు పోస్టింగ్‌తో పోలిస్తే 8.6 శాతం తగ్గాయని నెలవారీ నివేదిక హైలైట్ చేసింది. నౌకరీ జాబ్‌స్పీక్, నెలవారీ సూచిక, భారతీయ ఉద్యోగ మార్కెట్ స్థితి, నియామక కార్యకలాపాలను సూచిస్తుంది. నౌకరీ.కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌లో రిక్రూటర్‌ల ద్వారా కొత్త జాబ్ లిస్టింగ్‌లు, ఉద్యోగ సంబంధిత శోధనల ఆధారంగా వివరాలను క్లబ్ చేయడం ద్వారా డేటా తయారు చేయబడుతుంది.నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్’ నివేదిక ఐటీ రంగం అనేది ప్రపంచ ప్రకంపనలను ఎదుర్కొంటూనే ఉందని, గత కొన్ని నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపింది. పీఓ/ఐటీఈఎస్, ఎఫ్‌ఎంసీజీలు కూడా వరుసగా 25 శాతం, 23 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయని వెల్లడించింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 6 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. వడోదర, అహ్మదాబాద్, జైపూర్ నగరాలు గతేడాది ఇదే నెలలో సెప్టెంబర్‌లో నియామకాలలో వరుసగా 4 శాతం, 3 శాతం, 2 శాతం వృద్ధిని సాధించాయి.

*  5జీ ఫోన్లపై సర్వే

దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్‌ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్‌ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్‌ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్‌సెట్‌ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్‌లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్‌లో మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ గణనీయంగా పెరిగింది. స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్‌ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్‌ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్‌లో స్పీడ్‌ 3.59 రెట్లు పెరిగింది.మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్‌లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్‌ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్‌ వంటి అప్లికేషన్స్‌ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

వాహనదారులు ఎక్కువగా వినియోగించే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. కానీ, కొన్ని నెలల నుంచే ఈ ధరల్లో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66,లీటర్ డీజిల్ ధర రూ. 98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ110.48.,లీటర్ డీజిల్ ధర రూ.98 విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ.99

పెరుగుతున్న ఆయిల్ ధరలు

ఇజ్రాయెల్, పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడుల నేపథ్యంలో సోమవారం ఆయిల్ ధరలు 4 శాతం పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఓవైపు ఆంక్షల కారణంగా రష్యా ఆయిల్ ఎగుమతులు తగ్గించుకుంది. అదే సమయంలో ఆయిల్ ఎగుమతులపై సౌదీ కూడా స్వీయ నియంత్రణ విధించుకుంది. తాజాగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇజ్రాయెల్, పాలస్తీనాల ఆయిల్ ఎగుమతులపై పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  దీంతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు సోమవారం ఉదయం 4.7 శాతం పెరిగాయి. బ్యారెల్ 86.65 అమెరికన్ డాలర్లకు చేరగా.. టెక్సాస్ ఇంటర్మీడియెట్ 4.5  శాతం పెరిగి బ్యారెల్ 88.39 డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించకపోవడంతో ముడి చమురు ధరలు మరింత పైకి చేరొచ్చని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 పవన్ ముంజాల్ పై కేసు

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ ఖాతాల్లో రూ.5.96 కోట్ల లావాదేవీలపై తప్పుడు లెక్కలు రాసినందుకు, మోసపూరితంగా వ్యవహరించినందుకు, పొర్జరీ చేసినందుకు పవన్ ముంజాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సంస్థ తరఫున ఫేక్ బిల్లులు సృష్టించి రూ.55.5 లక్షల టాక్స్ క్రెడిట్ పొందారని పవన్ ముంజాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.పవన్ ముంజాల్.. 2000-2010 మధ్య నెలవారీగా రూ.5,94,52,525 విలువైన ఫేక్ బిల్లులు తయారు చేశారు. ఈ బిల్లుల పేరుతో ఇంతే మొత్తం నగదు బ్యాంకు ఖాతాల నుంచి విత్ డ్రా చేశారు. తద్వారా ఫేక్ బిల్లులతో రూ.55,51,777 ‘ఫేక్ టాక్స్ క్రెడిట్’ దాఖలు చేసి ఆదాయం పన్ను విభాగాన్ని మోసగించారు` అని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఈ వార్తలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో హీరో మోటో కార్ప్ షేర్లు మూడు శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు గత ఆగస్టులో పవన్ ముంజాల్ ఇల్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేసింది. 2018లో లండన్‌లో పవన్ ముంజాల్ వ్యాపార పర్యటన కోసం థర్డ్ పార్టీ సేవల సంస్థ అధికారిని నియమించుకున్నది హీరో మోటో కార్ప్. ముంజాల్, ఆ థర్డ్ పార్టీ సంస్థ అధికారి లండన్ బయలుదేరి వెళుతుండగా, సదరు అధికారి బ్యాగ్‌లో రూ.81 లక్షలకు పైగా విదేశీ కరెన్సీ ఉందని కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో గుర్తించారు. ఈ కరెన్సీని కస్టమ్స్ అధికారులు జప్తు చేసి, కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే ఈడీ తనిఖీలు చేసింది. పన్ను ఎగవేత కేసులో గతేడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇల్లు, ఆఫీసుల్లో ఆదాయం పన్ను అధికారులు తనిఖీలు జరిపారు.