Business

ఏఐ సాయంతో ఒకేసారి వేల ఉద్యోగాలకు దరఖాస్తు- వాణిజ్య వార్తలు

ఏఐ సాయంతో ఒకేసారి వేల ఉద్యోగాలకు దరఖాస్తు- వాణిజ్య వార్తలు

దీపావళికి ఉద్యోగులకు EPF బహుమతి

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్ ఖాతాల్లో 8.15 శాతం వడ్డీ సొమ్మును జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయాన్ని EPFO ‘X’ లో సమాచారాన్ని పంచుకుంది. Xలోని ఒక వినియోగదారు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఇంకా ఖాతాలో జమ కాలేదని చెప్పారు. ఎప్పుడు డిపాజిట్ చేయవచ్చు’ అని ఎక్స్‌లో అడిగాడు. బదులుగా, EPFO ఈ సమాచారాన్ని పంచుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాపై 8.15 శాతం వడ్డీని ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఈ ఏడాది జూలైలో ఈపీఎఫ్ ఖాతాకు 8.15 శాతం వడ్డీ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.

* ఏఐ సాయంతో ఒకేసారి వేల ఉద్యోగాలకు దరఖాస్తు

ప్రముఖ కంపెనీలు కూడా లేఆఫ్ లు ప్రకటించి చాలామంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవానికి తగ్గ ఉద్యోగం చేజిక్కించుకోవడం అంత సులభం కాదు. వందలాది కంపెనీలకు దరఖాస్తు చేసి, ఇంటర్వ్యూలలో మెప్పించినా సరే.. అపాయింట్ మెంట్ లెటర్ అందుకునేదాకా గ్యారంటీ లేదు. ఆఫర్ లెటర్ ఇచ్చినా జాబ్ లో చేరేదాకా సదరు ఆఫర్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే ఓ వ్యక్తి ఏఐ (కృత్రిమ మేధ) సాయం తీసుకున్నాడు.జూలియన్ జోసెఫ్ అనే వ్యక్తి ఇటీవల ఉద్యోగం కోల్పోయాడు. ప్రతీ కంపెనీకి దరఖాస్తు చేస్తూ తన అనుభవం, అర్హతకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేపట్టాడు. స్వయంగా 300 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న జోసెఫ్.. కృత్రిమ మేధను ఆశ్రయించాడు. ఏఐ సాయంతో పనిచేసే జాబ్ జీపీటీ ఏఐ బాట్ కు తన అర్హతలతో పాటు ఉద్యోగ వివరాలకు సంబంధించి కొంత సమాచారం అందించాడు. దీంతో ఒకే ఒక రాత్రిలో జోసెఫ్ తరఫున వెయ్యి కంపెనీలకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది.మరుసటి రోజు కూడా ప్రయత్నించి మొత్తం 5 వేల ఉద్యోగాలకు దరఖాస్తు చేశానని జోసెఫ్ చెప్పాడు. అయితే, ఏఐతో పంపిన దరఖాస్తులకు కంపెనీల నుంచి స్పందన నామమాత్రంగానే ఉందని, తాను స్వయంగా దరఖాస్తు చేసిన 300 కంపెనీలలో 20 కంపెనీల నుంచి ఇంటర్వ్యూకు కాల్ వచ్చిందని తెలిపాడు. కృత్రిమ మేధతో వేల కంపెనీలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ తగిన రెస్పాన్స్ రావాలంటే స్వయంగా దరఖాస్తు చేసుకోవడమే మేలని తనకు అనుభవంలోకి వచ్చిందని చెప్పాడు.

*  ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్

కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు.కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు ఉద్యోగం కోల్పోయి ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత, యూట్యూబ్ ఛానెల్‌ కలిగి ఉన్న టెకీ తన టెస్లాను డ్రైవ్ చేస్తూ నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనీష్ మావెలిక్కర తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో.. తాను ఐటీ ఉద్యోగం కోల్పోయినట్లు, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నట్లు.. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైనట్లు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని వెల్లడించాడు.ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైమ్ ఉద్యోగంగా కిరాణా సామాగ్రిని ఇంటింటికి డెలివరీ చేస్తున్నట్లు కూడా వీడియోలో తెలిపాడు. ప్రతి రోజూ తన పని తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని, తన టెస్లా కారుని ఉబెర్‌తో నడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఒకవేళా ఉద్యోగం లభించకపోతే తన టెస్లా కారుని రోజంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా వివరించాడు.

ఏసీల తయారీ కంపెనీలను ఆదేశించిన ప్రభుత్వం

ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై ఇచ్చే వారంటీ, గ్యారెంటీ రూల్స్‌‌‌‌‌‌‌‌ను కొద్దిగా మార్చాలని కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. వీటికి డిమాండ్ పెరుగుతుండడంతో  ఈ  వస్తువులపై ఇచ్చే వారంటీ, గ్యారెంటీలను కొన్న రోజు నుంచి కాకుండా ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేసిన రోజు నుంచి లెక్కించాలని తెలిపింది.  కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ మార్పులు చేపట్టాలని  కంపెనీలకు, ఆర్గనైజేషన్లకు  లెటర్స్ రాశారు.  సీఐఐ, ఫిక్కీ, అసోచామ్‌‌‌‌‌‌‌‌, ఫీహెచ్‌‌‌‌‌‌‌‌డీ ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ కామర్స్ అండ్  ఇండస్ట్రీ వంటి ఆర్గనైజేషన్లకు, శామ్‌‌‌‌‌‌‌‌సంగ్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌జీ, పానాసోనిక్‌‌‌‌‌‌‌‌, బ్లూ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెంట్‌‌‌‌‌‌‌‌, వోల్టాస్ వంటి కంపెనీలకు ఆయన లెటర్స్ పంపారు. ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఏసీలు,  వాషింగ్ మెషిన్లు వంటి వైట్‌‌‌‌‌‌‌‌ గూడ్స్ సేల్స్ బాగా జరుగుతున్నాయి. వారంటీ, గ్యారెంటీల విషయంలో కన్జూమర్లు లాభపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా, కన్జూమర్ కొన్నాక  ఏసీలు వంటి ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌లు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌లు వచ్చేంత వరకు ఇవి వాడకుండా పక్కన పడి ఉంటున్నాయి.

కంగుతిన్న ఐటీ ఉద్యోగి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత రెజ్యూమ్‌లు తయారు చేస్తున్నారా? వాటి సాయంతో ఉద్యోగాలకు అప్లయ్‌ చేస్తున్నారా? అయితే, తస్మాత్‌ జాగ్రత్తా. ఏఐ సాయం తీసుకుని వేలాది కంపెనీలకు ధరఖాస్తు చేసుకున్నా ఒక్క ఉద్యోగం దొరకడం లేదు. ఆర్ధిక మాంద్యం భయాలు, లేఆఫ్స్‌, ప్రాజెక్ట్‌ల కొరత.. ఇలాంటి కఠిన సమయాల్లో నచ్చిన కంపెనీలో కోరుకున్న జాబ్‌ పొందడం అంటే అంత సులభం కాదు. అయినప్పటకీ ఓ ఐటీ ఉద్యోగి జాబ్‌ కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఫలితంగా..యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఆటోమెషిన్‌లో విధులు నిర్వహించే జూలియన్‌ జోసెఫ్‌ రెండేళ్లలో రెండు సార్లు ఉద్యోగం (లేఆఫ్స్‌) పోగొట్టుకున్నాడు. ప్రయత్నాల్ని విరమించకుండా కొత్త జాబ్‌కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇందుకోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవంలందించే ‘లేజీ అప్లయ్‌’ వెబ్‌పోర్టల్‌ని ఆశ్రయించాడు.లేజీ అప్లయ్‌లో ఏఐ జాబ్‌జీపీటీ అనే సర్వీసులున్నాయి. దీని సాయంతో నెలకు 250 డాలర్లు వెచ్చించి సింగిల్‌ క్లిక్‌తో వేలా ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. కేవలం అభ్యర్ధి వివరాలు ఇస్తే సరిపోతుంది. జోసెఫ్‌ అదే పనిచేశాడు. ఉద్యోగం కోసం తన స్నేహితురాలి ల్యాప్ ట్యాప్‌ తీసుకుని రేయింబవళ్లు శ్రమించి 5వేల ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకున్నాడు. ఆపై కంగుతినడం జోసెఫ్‌ వంతైంది. ఎందుకంటే? వేలాది సంస్థల్లో ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకుంటే.. కేవలం 20 సంస‍్థలనుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి.పైగా తాను మ్యానువల్‌గా 300 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే 20 ఇంటర్య్యూ కాల్స్‌ వచ్చాయని జోసెఫ్‌ తెలిపాడు. కొన్ని సార్లు అప్లికేషన్‌లోని ప్రశ్నలకు ఈ ఏఐ సంబంధం లేని సమాధానాలను అందిస్తుండటడంతో స్పందన కరువైంది. సమయం ఆదా అయినప్పటికీ ఏఐ సాయంతో సక్సెస్‌ రేటు తక్కువే అని జోసెఫ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాబట్టి, ఇంటర్వ్యూల కోసం సన్నద్ధమవుతున్న ఉద్యోగులు ఏఐలాంటి టూల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని టెక్నాలజీ నిపుణులు సలహా ఇస్తున్నారు.

యూఎస్ బాండ్‌‌ మార్కెట్‌‌పై మూడీస్ నెగెటివ్‌‌

 యూఎస్ గవర్నమెంట్ బాండ్ల  ఔట్‌‌లుక్‌‌ను క్రెడిట్ రేటింగ్‌‌ ఏజెన్సీ మూడీస్‌‌ ఇన్వెస్టర్స్‌‌ సర్వీస్‌‌  తగ్గించింది. ముందిచ్చిన ‘స్టేబుల్‌‌’ ఔట్‌‌లుక్‌‌ను  ‘నెగెటివ్‌‌’ కు డౌన్‌‌గ్రేడ్ చేసింది. వడ్డీ రేట్లు పెరగడంతో ఖర్చులు పెరుగుతున్నాయని, యూఎస్ కాంగ్రెస్‌‌లో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే కారణాలను చూపింది.యూఎస్‌‌ గవర్నమెంట్ బాండ్లపై ‘ఏఏఏ’ రేటింగ్‌‌ను మాత్రం కొనసాగించింది. గతంలో ఫిచ్ రేటింగ్ యూఎస్ డెట్ మార్కెట్‌‌ ఔట్‌‌లుక్‌‌ను ‘ఏఏఏ’ నుంచి ‘ఏఏ +’ కు తగ్గించిన విషయం తెలిసిందే. ఫైనాన్షియల్ సంస్థలు రేటింగ్‌‌లు తగ్గించేస్తే ప్రభుత్వాలు ఎక్కువ వడ్డీ చెల్లించి ఫండ్స్ సేకరించాల్సి ఉంటుంది.

ఈ కార్లపై భారీ డిస్కౌంట్‌

అత్యధిక తగ్గింపుతో 5 కార్లు: పండగ వేళ మీరు SUVని కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు. నిజానికి ఈ పండుగ సీజన్‌లో ఎస్‌యూవీ వాహనాలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో అత్యధిక డిస్కౌంట్‌ని ఇస్తున్న 5 కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.Mahindra Xuv400- పండుగ సీజన్‌లో అత్యధిక తగ్గింపుతో లభించే SUV మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV. ఈ పూర్తి ఎలక్ట్రిక్ SUV మోడళ్లపై కంపెనీ 3 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తోంది. అయితే పాత మోడళ్లపై 3.5 లక్షల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ SUVపై 5 సంవత్సరాల పాటు ఉచిత బీమా, ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. మహీంద్రా XUV400 ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.Hyundai Kona Electric car- దీపావళి పండుగ సీజన్‌లో అత్యధిక తగ్గింపుతో లభించే రెండవ కారు హ్యుందాయ్ కోనా. దీపావళి సందర్భంగా హ్యుందాయ్ కోనాపై రూ.2 లక్షల తగ్గింపును అందిస్తోంది. హ్యుందాయ్ గతంలో ఈ కారుపై లక్ష రూపాయల తగ్గింపును ఇస్తోంది. అదే సమయంలో సెప్టెంబర్ నుంచి రాయితీని రూ.2 లక్షలకు పెంచారు. హ్యుందాయ్ కోనా ధర రూ.23.84 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.citroen c5 aircross – ఫ్రెంచ్ కార్ తయారీదారు సిట్రోయెన్ భారతదేశంలో తన 7-సీటర్ SUV C5 ఎయిర్‌క్రాస్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో C5 ఎయిర్‌క్రాస్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ పూర్తి సన్నాహాలు చేసింది. ఈ పండుగ సీజన్‌లో సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్‌పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ SUV ధర రూ. 36.91 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.Skoda Kushaq- అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న కార్ల జాబితాలో స్కోడా కుషాక్ కూడా చేరింది. నవంబర్‌లో ఈ కారుపై రూ.1.5 లక్షల తగ్గింపును అందజేస్తున్నారు. స్కోడా కుషాక్ ధర రూ. 10.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.Mg Astor- MG ఆస్టర్ కూడా అత్యంత తగ్గింపు కారుగా మారింది. ఈ నెలలో ఆస్టర్ ఎస్‌యూవీపై రూ.1.75 లక్షల తగ్గింపు ఇస్తోంది. ఈ SUV ధర రూ. 10.82 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z