Devotional

శ్రీవారి సేవ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

శ్రీవారి సేవ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 24న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే గురువారం తెలిపింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

న‌వంబ‌రు 27న శ్రీ‌వారి సేవ టికెట్లు విడుద‌ల‌
2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించి శ్రీవారి సేవ స్లాట్లను నవంబరు 27న ఉదయం 10గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్‌ చేసుకునేందుకు అర్హులు. తిరుమల, తిరుపతిలో భక్తులు స్వచ్ఛందసేవ చేసేందుకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను నవంబరు 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు పరకామణి సేవ కోటాను తితిదే విడుదల చేయనుంది. ఈ సేవ‌ల‌ను www.tirumala.org వెబ్‌సైట్‌లో భ‌క్తులు బుక్ చేసుకోవ‌చ్చని తితిదే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z