Devotional

కార్తీకమాసం శని త్రయోదశి విశిష్టత

కార్తీకమాసం శని త్రయోదశి విశిష్టత

కార్తీకమాసం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ప్రతీరోజు చాలా పవిత్రమైనది. అయితే ఈ సంవత్సరం శ్రీ శోభకృత్‌ 25 నవంబర్‌ 2023 కార్తీక మాస శుక్ల పక్షం త్రయోదశి శనివారం (స్థిరవారం) కావడం చేత … ఈ శని త్రయోదశి చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు.

కార్తీక మాసంలో శనివారం త్రయోదశి ( నవంబర్​ 25) కలసిరావడం .. శనిత్రయోదశి నాడు నవగ్రహ పూజలకు, శివారాధనలకు, శని ఈతిబాధలను తొలగించుకోవడానికి శని భగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. అటువంటి శని త్రయోదశి ( నవంబర్​ 25) శివుడికి ప్రీతికరమైన కార్తీకమాసంలో రావటం చాలా విశేషం. గోచారపరంగా ( జాతక రీత్యా) ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమశని వంటి ఇబ్బందులు పడుతున్నారో, జాతకంలో శని దోషాలు వలన శని మహర్దశ, అంతర్దశ వలన ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఆ దోష నివృత్తి చేసుకోవడానికి ఒక అద్భుత అవకాశం జ్యోతిష్యులు చెబుతున్నారు.

శోభకృత్​ నామ సంవత్సరంలో శని కుంభరాశిలో సంచరించుట వలన నవంబర్​ 25వ తారీఖు వచ్చినటువంటి శని త్రయోదశి రోజున మకరరాశి, కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి వృశ్చికరాశి వారు శని భగవానుడిని పూజించాలి. ఇలా ఆచరించడం వలన వారికి తగులుతున్న శని దోష ప్రభావం తక్కువుగా ఉంటుంది. వీరే కాకుండా అందరూ కూడా శని భగవానుడిని పూజిస్తే ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతారు.

కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు (నవంబర్​) ఏమి చేయాలంటే…
నవంబర్​ 25 శనివారం ఉదయం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానమాచరించడం, తలస్నానం వంటివి ఆచరించడం మంచిది. ఈరోజు నవగ్రహ ఆలయాల్లో శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం … నవగ్రహ ఆలయాలను దర్శించి అక్కడ శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం చాలా మంచిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఆ రోజు ( నవంబర్​ 25) శివాలయాల్లో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈరోజు ఉపవాసం, నక్తం (ఒకపూట తినడం) వంటివి ఆచరించడం నూనె పదార్థాలు వంటివి స్వీకరించకుండా ఉండటం మంచిదని పూజారులు అంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z