Movies

ఇదో అద్భుతమైన కథ!

ఇదో అద్భుతమైన కథ!

“సీతారామం’తో ప్రేక్షకులు నన్ను చూసే విధానం మారింది. నేను ఎంచుకునే పాత్రల విషయంలో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకే.. మనసుకు దగ్గరైన మంచి పాత్రలు చేయాలని నిశ్చయించుకున్నాను. ‘హాయ్‌ నాన్న’లో నేను చేసిన ‘యష్ణ’ పాత్ర అలాంటిదే. ఇదో అద్భుతమైన కథ. విరాజ్‌, యష్ణ ప్రయాణాన్ని చూసిన ప్రేక్షకులు కచ్చితంగా వారితో ప్రేమలో పడిపోతారు.’ అని మృణాళ్‌ ఠాకూర్‌ అంటున్నది. నాని జోడీగా ఆమె నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. శౌర్యువ్‌ దర్శకుడు.

మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మృణాళ్‌ ఠాకూర్‌ విలేకరులతో ముచ్చటించింది. ‘ ‘సీతారామం’లో సీత.. ‘హాయ్‌ నాన్న’లో యష్ణ. రెండూ వైవిద్యమైన పాత్రలే. ‘సీతారామం’ 60, 70ల్లో జరిగే కథ. ‘హాయ్‌ నాన్న’ నేటి తరానికి చెందిన కథ. ఇందులో నా పాత్ర కూడా ఇప్పటి అమ్మాయిలకు ప్రతిరూపంలా ఉంటుంది.

ఈ పాత్రలో చాలా లేయర్లుంటాయి. మానవసంబంధాలు, భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా. ఒక్కమాటలో చెప్పాలంటే ‘డివైన్‌’. షూటింగ్‌ చేస్తున్నప్పుడు అదే భావనతో పనిచేశాం’ అని చెప్పింది మృణాల్‌. నానీతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని, ఆయనతో నటిస్తుంటే పర్‌ఫార్మెన్స్‌ మరింత ఎలివేట్‌ అవుతుందని మృణాళ్‌ అన్నారు.

అందరం నిజాయితీగా పనిచేశాం. చేస్తున్నప్పుడే గొప్ప సినిమా అని అర్థమైపోయింది. దర్శకుడు శౌర్యువ్‌తో పనిచేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. తను క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ని ఈ నెల 7న చూస్తారు’ అని చెప్పింది మృణాళ్‌. నిర్మాతలు రాజీ అనే పదానికి తావివ్వకుండా పాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారని, సాంకేతికంగా అద్భుతం గా ఈ సినిమా ఉంటుందని ఆమె అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z