Movies

సంక్రాంతి బరిలో సందడి చేయనున్న మహేశ్‌బాబు

సంక్రాంతి బరిలో సందడి చేయనున్న మహేశ్‌బాబు

గుంటూరు కారం’తో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు మహేశ్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఈ చిత్రంలో మిగిలి ఉన్న ఆఖరి పాట చిత్రీకరణ ఈనెల 21నుంచి మొదలు కానుంది. ఈ విషయాన్ని నిర్మాత ఎస్‌.నాగవంశీ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ‘‘గుంటూరు కారం’లో మొత్తం నాలుగు పాటలతో పాటు ఒక బిట్‌ సాంగ్‌ ఉంది. మూడు పాటలతో పాటు బిట్‌ గీతం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. మిగిలిన ఒక్క పాటను మా షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 21నుంచి చిత్రీకరించనున్నాం’’ అని ప్రకటించారు. ఈ మాస్‌ యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనవరి 12న థియేటర్లలోకి రానుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z