DailyDose

సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన

సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన

సుప్రీంకోర్టులో బుధవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తనను అసహనానికి గురి చేసిన న్యాయవాదిపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించాలని హెచ్చరించారు. కోర్టును బెదిరించాలనుకుంటున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంతో సీజేఐ ఇలా స్పందించారు. ‘మీరు సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్‌ చేస్తారు.. గొంతును పెంచడంద్వారా కోర్టును బెదిరించలేరు.. నా 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నా పదవి ఆఖరి సంవత్సంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదు. గొంతు తగ్గించండి. దేశంలోని తొలి కోర్టులో మీరు వాదించే విధానం ఇదేనా.. ఎల్లప్పుడూ ఇలాగే జడ్జిల దగ్గర అరుస్తూ ఉంటారా..’ అని న్యాయవాదిపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ న్యాయవాది సీజేఐకి క్షమాపణలు చెప్పారు. సంయమనంతో వ్యవహరించాలని న్యాయవాదులను సీజేఐ హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ ఇలాగే మాట్లాడటంతో తగ్గాలని సీజేఐ హెచ్చరించారు. గతేడాది అక్టోబరులో కోర్టు హాలులో ఓ న్యాయవాది ఫోన్‌లో మాట్లాడటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా మార్కెట్టా ఫోన్‌లో మాట్లాడుకోవడానికి అని వ్యాఖ్యానించారు. అప్పుడే న్యాయవాదుల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z