Business

సంక్రాంతికి స్పెషల్ బస్సులు

సంక్రాంతికి స్పెషల్ బస్సులు

సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగ కోసం 4,484 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రేపటి నుంచి ఈ స్పెషల్ బస్సులు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం బయలుదేరనున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకూ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ఏపీతో పాటుగా… హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అత్యధికంగా ఈ సర్వీసులను నడుపుతంది. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు ఈ సర్వీసులను నడుపుతున్నామని చెబుతున్నారు. దీంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు కూడా స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దుల వరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z