Devotional

అయోధ్య దర్శనం పాస్‌లు ఇలా లభిస్తాయి-తాజావార్తలు

అయోధ్య దర్శనం పాస్‌లు ఇలా లభిస్తాయి-తాజావార్తలు

* అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి వేళల (ఆఅర్తి, డర్షన్ తిమింగ్స్) వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఆ వివరాలు ఇలా..

దర్శన వేళలు : ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు
జాగరణ హారతి : ఉదయం 6.30 గంటలకు (ఒక రోజు ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది)
సంధ్యా హారతి: రాత్రి 7.30 గంటలకు (అందుబాటును బట్టి అదే రోజు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది)

రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్‌ ఇస్తారు కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్దకానీ పాస్‌ తీసుకున్న వాళ్లకే హారతి సమయంలో అనుమతిస్తారు. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది.

బాలరాముడి దర్శనం/హారతి పాస్‌లకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఇలా..
1. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. మీ మొబైల్‌ నంబరుతో సైన్‌ ఇన్‌ అయి ఓటీపీ ఎంటర్‌ చేస్తే మీ రిజిస్ట్రేషన్‌ నమోదు పూర్తవుతుంది.
3. ఒకసారి లాగిన్‌ అయిన తర్వాత.. ‘మై ప్రొఫైల్‌’ సెక్షన్‌లోకి వెళ్లి మీ గుర్తింపు వివరాలు, చిరునామా వంటివి ఎంటర్‌ చేయాలి.
4. ఆ తర్వాత హారతి/దర్శనం టైమ్‌ స్లాట్లను ఎంచుకుని.. పాస్‌ కోసం బుక్‌ చేసుకోవాలి.
5. ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్‌లో మీ పాస్‌లు తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.

* దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం (ఆయొధ్య ఋఅం ంఅందిర్) ఎట్టకేలకు సాకారమైంది. గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరిన క్షణాలను యావత్‌ దేశం వీక్షించింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. దీంతో బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ఇలా నిత్యం 1 నుంచి 1.5లక్షల మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది. దీంతో దేశ పర్యాటక ముఖ చిత్రమే మారనుందని అభిప్రాయపడింది.

* ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్య (ఆయొధ్య ఋఅం ంఅందిర్)లో బాలరాముడు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవం అనంతరం ప్రధాని మోదీ (ఫం మొది) ప్రసంగించారు. ‘జై సియా రామ్‌’ అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన రామ్‌లల్లా ఇక టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్యమందిరంలో కొలువుదీరారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.

* ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌ (శైఫ్ ఆలి ఖన్) ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఆయన మోకాలు, భుజానికి గాయమైందని, శస్త్ర చికిత్స కోసం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఉదయం చేరారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకు ముందు ట్విటర్‌)లోనూ సంబంధిత పోస్ట్‌లు కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘దేవర’ (డెవర) యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో చోటుచేసుకున్న ప్రమాదంలో సైఫ్‌కు గాయాలయ్యాయని సమాచారం. దీనిపై ఈ నటుడు గానీ, చిత్ర బృందం గానీ స్పందించలేదు.

* అయోధ్యలో (ఆయొధ్య ఋఅం ంఅందిర్) బాల రాముడు కొలువుదీరాడు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ అపూర్వ ఘట్టం కనులపండువగా సాగింది. సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ఠాపన వేడుకను కోట్లాది మంది భక్తులు తిలకించారు. ఈ సమయంలో టెంపుల్‌ సిటీగా పేరొందిన ఒడిశా (ఒదిష) రాజధాని భువనేశ్వర్‌ సమీపంలో, అయోధ్యకు సుమారు వెయ్యి కి.మీ. దూరంలో మరో రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణపత్రిష్ఠ జరిగిన సమయంలోనే ఇక్కడా ఆలయాన్ని ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

* ఈ తరంలో విరాట్‌ కోహ్లీ (విరత్ ఖొహ్లి) అత్యుత్తమ బ్యాటర్‌ అని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసించాడు. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసినందుకు అభినందిస్తూ 100 సెంచరీలు త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అక్తర్‌, కోహ్లీ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

* అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగిన వేళ పలువురు గర్భిణులకు చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోయింది. ఈ పవిత్ర సమయంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో రెండు ప్రభుత్వాసుపత్రుల్లో 15మంది శిశువులు జన్మించారని అధికారులు వెల్లడించారు. వీటిలో 11 సాధారణ ప్రసవాలు కాగా.. మిగిలినవారికి సిజేరియన్‌ ద్వారా కాన్పులు జరిగినట్లు ఎంటీహెచ్‌ ఆస్పత్రి సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుమిత్రా యాదవ్‌ వెల్లడించారు. పుట్టిన శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, దేపాల్‌పుర్‌ సివిల్‌ ఆస్పత్రిలో లోకేశ్‌, సంజన దంపతులకు ఆడ శిశువు జన్మించినట్లు అక్కడి వైద్యురాలు తెలిపారు. సంజనకు జనవరి 22న కాన్పు చేయాలని తాను ముందుగానే వైద్యులను కోరగా.. ప్రసవానికి తగిన సమయం పూర్తికాకపోవడంతో వైద్యులు నిరాకరించారని లోకేశ్‌ అనే వ్యక్తి తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 11గంటల సమయంలో తన భార్యకు నొప్పులు రావడంతో సిజేరియన్‌ చేశారని, తమకు పాప పుట్టిందని.. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు అతడు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇందౌర్‌లో జనవరి 22న జన్మించిన 15మందిలో మగ, ఆడ శిశువులు ఎందరనే వివరాలు మాత్రం తెలియలేదు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఈ చారిత్రక రోజును చిరస్మరణీయంగా మలచుకోవాలన్న ఆశతో ప్రసవ తేదీ దగ్గరపడిన అనేకమంది గర్భిణులు తమకు సిజేరియన్‌ ప్రసవం చేయాలని వైద్యులపై ఒత్తిడి చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

* తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత 42 రోజులుగా సమ్మె చేస్తోన్న అంగన్వాడీలు, హెల్పర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరని వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుంటూరు జిల్లాలో విధులకు హాజరుకాని 1,734 మంది, పల్నాడు జిల్లాలో 1,358 మందిని తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు టెర్మినేషన్‌ ఆర్డర్లను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80వేల మందికిపైగా సిబ్బందిని తొలగిస్తూ టెర్మినేషన్‌ ఆర్డర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

* ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమైంది. బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ బృహత్ కార్యం సాకారం కావడానికి కలిసిన చేతులు ఎన్నో! దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు సమకూర్చారు. ఇందులో రోజువారీ కూలీలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఉన్నారు. ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి, ఆయన కుటుంబం ముందువరుసలో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్‌లో బంగారం 10 గ్రాములు రూ.68వేలుగా ఉంది. ఆ లెక్కన రామాలయానికి లాఖి కుటుంబం రూ.68 కోట్లు విరాళంగా ఇచ్చినట్లయ్యింది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది.

* ‘ధరణి’ సమస్యలపై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని కమిటీ వెల్లడించింది. పోర్టల్‌ సమస్యలతో పాటు దానికి ముడిపడి ఉన్న అన్ని శాఖలతో చర్చించి సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాల్సి ఉందని తెలిపింది. సోమవారం మూడోసారి సీసీఎల్‌ఏలో సమావేశమైన కమిటీ.. అనేక అంశాలపై చర్చించింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ‘‘ధరణి పోర్టల్‌ ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయి. వీటి కారణంగా రైతులు భూ హక్కులు కోల్పోయారు. అనేక తప్పిదాలతో రైతు బంధు, ఇతర ప్రభుత్వ రాయితీలను అన్నదాతలు పొందలేకపోయారు. ధరణి బాధితులకు త్వరితగతిన ఉపశమనం కల్పించేందుకు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఈ పోర్టల్‌లో ఏమాత్రం పారదర్శకత లేదు. భూమి యజమానికి తెలియకుండా లావాదేవీలు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. మరింత లోతైన అధ్యయనం చేయకుండా ముందుకు వెళ్లలేం. త్వరలో జిల్లా కలెక్టర్లతోపాటు వ్యవసాయ, రిజిస్ట్రేషన్ శాఖలతో సమావేశమవుతాం’’అని తెలిపారు.

* నందికొట్కూరు టికెట్‌ ఇస్తాం గానీ… పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, ఐప్యాక్‌ రాయలసీమ ఇన్‌ఛార్జి దివాకర్‌రెడ్డి అన్నారని, ఆ వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కర్నూలులో నియోజకవర్గ నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది జూన్‌ 24న రామసుబ్బారెడ్డి, దివాకర్‌రెడ్డిని కలిసినప్పుడు జరిగిన సంభాషణను ఈ సందర్భంగా ఆర్థర్‌ గుర్తుచేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z