NRI-NRT

కెనడా: వైభవంగా నోవా స్కోటియా తెలుగు సంఘం సంక్రాంతి వేడుకలు

కెనడా: వైభవంగా నోవా స్కోటియా తెలుగు సంఘం సంక్రాంతి వేడుకలు

కెనడాలోని నోవా స్కోటియాలో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారు. హాలిఫాక్స్, డార్ట్ మౌత్ , బెడ్ ఫోర్డ్ ప్రాంతానికి చెందిన ప్రవాసులు బెడ్‌ఫోర్డ్‌లోని ఫ్రెంచ్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. నిర్వాహకులు సుప్రజా హరి,   ప్రియాంక సురేష్, శ్రీలేఖ తదితరులు ప్రాంగణాన్ని సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. నోవా స్కోటియాలోని 300కి పైగా తెలుగు కుటుంబాలు ఈ పండుగలో పాల్గొన్నారు. కనకం, దేవిక, పార్వతి, ప్రతిభ, సుప్రజాహరిలు జ్యోతి ప్రజ్వలనం చేసి గణేశ వందనంతో సంబరాలను ప్రారంభించారు. అధ్యక్షుడు శ్రీహరి రెడ్డి చల్లా అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు.



చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. సిబి నాథన్ కర్ర సాము నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. “సొగసు చూడ తరమా” పేరిట దంపతుల మధ్య పోటీలు హాస్యాన్ని పంచాయి. పార్వతి శాస్త్రి చెల్లూరి, వేణుగోపాల్ రావు బెజవాడ, నూకరాజు కరణం కళాకారులను జ్ఞాపికతో సత్కరించారు. నిత్య శ్రీ విద్య, రోహిత్ సాయి చల్లా, శ్రీనివాస్ చిన్ని, మహాశ్విన్ విద్యా, సుసుష్మ ప్రదీప్ దాన్షిక సురేష్, మిహిర మొగలిపురి, శ్రేష్ఠ శ్రీమయీ దొంతంశెట్టి, అమూల్య పిన్ని,  సంగీత రాజు, కీర్తన రాజీవ్, మెగ్గీ కరమ్, మోక్షిత చిన్ని, సాయి రేయాన్ష్ చిన్ని, హర్షవర్ధన్ ఆలేటి, శిబి నందన్ మహేష్ కుమార్, జోషిత్ మొగలిపురి, ఆరాధ్య మల్కా, పూజ బరన్వాల్, రితి నైనికా కోతా, రిధి బొజ్జినిలు తమ ప్రదర్శనలతో అలరించారు. వెంకట్, సత్యం, సర్ధార్ ఖాన్్‌లు ఫోటోగ్రఫీ సహకారం అందించారు. విజయ్ రాహుల్ భాష్యకర్ల, జితేందర్ బాలి, ఆండ్రూ లీపర్, శివ నవనీథన్ వేడుక విజయవంతానికి తోడ్పడ్డారు.




👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z