NRI-NRT

NRI BRS: కువైట్‌లో కవిత జన్మదిన వేడుకలు

NRI BRS: కువైట్‌లో కవిత జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్‌ ఎన్నారై కువైట్‌( Kuwait) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ఎన్నారై కువైట్‌అధక్షురాలు అభిలాష గొడిశాల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ.. కవిత అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పండుగను విశ్యవ్యాప్తం చేయడంలో ఆమె ఎంతో శ్రమించారని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేయడంతో పాటు మరెన్నో విషయాల్లో మా మహిళలందరికి కవిత స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఆక్షాంక్షించారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, రవి సుధగాని, తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z