ScienceAndTech

Samsung A31 వచ్చేసింది

The all new Samsung A31 is here - Review - Details

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల చేయనుంది. గెలాక్సీ శ్రేణిలో ఏ31 పేరుతో దీన్ని తీసుకొస్తోంది. మే 4నుంచి ఈ ఫోన్‌ విక్రయాలను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకతలను వెల్లడించింది.

గెలాక్సీ ఏ31 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌అమోల్డ్‌ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లేతో రానుంది. ఇక ఇందులో మీడియా టెక్‌ హీలియో పీ65 ప్రాసెసర్‌ను వినియోగించనట్లు సమాచారం. 4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లతో పాటు, 64జీబీ, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డు సాయంతో 512జీబీ వరకూ మెమొరీని పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు నాలుగు కెమెరాలను అమర్చారు. ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్‌ కాగా, 8మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌,5 మెగాపిక్సెల్‌ మాక్రో షూటర్‌, 5 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 20మెగాపిక్సెల్‌ కెమెరాను ఉంచారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్‌ రానుంది. ఇక ధర విషయానికొస్తే రూ.23వేలు ఉంటుందని సమాచారం.