Editorials

వివాహానికి పూర్వమే కు.ని. ఆపరేషన్ చేయించుకున్న నిస్వార్థ నాయకుడు…పుచ్చలపల్లి

The inspiring life story of Comrade Pucchalapalli Sundarayya

“తనకు పిల్లలు పుడితే ఎక్కడ తనలో స్వార్థం ప్రవేశించి ప్రజల శ్రేయస్సు గురించి మరిచిపోతానేమో అనే ఆలోచనతో పెళ్ళి కాకముందే పిల్లలు లేకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నిస్వార్థ నాయకుడు…ఈయన.

పార్లమెంట్ సభ్యుడుగా వున్నప్పుడు పార్లమెంట్ సమావేశాలకు ఎప్పుడూ-సైకిల్ -మీదే వెళ్ళేవాడు..ఇతని కోసం ఒక సైకిల్ స్టాండ్ వుండేది పార్లమెంట్ ఆవరణలో….

పుట్టింది జమీందార్ ఇంట..భూస్వామి…అయినా తన ఆస్థినంతా నిరుపేదలకు పంచిపెట్టేశాడు”-

కులానికి వ్యతిరేఖి అయినందున తన పేరు చివరన వున్న “తన కులహోదా”ని తెలిపే పదాన్ని తొలిగించుకున్నాడు.

లాయర్ కావాలన్న తన తమ్ముడిని “డాక్టర్ చదివి పేదలకు అతి తక్కువ ఫీజుతో సేవచేయమని సలహా ఇచ్చారు..అతని సలహా పాటించిన తమ్ముడు డాక్టర్ అయి ఒక వైద్యశాలను స్థాపించి పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్య సేవలందించారు.. ఇప్పటికీ ఒక జిల్లాలో పేదల హాస్పటల్ గా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించింది ఆ హాస్పటల్ ..

తెల్లని దుస్తులు పైన ఎర్రకండువా..పెదవులపై చెరగని చిరునవ్వు ఆ నాయకుడి ఆహార్యం..ఇంతకీ ఆ నాయకుడెవరనుకుంటున్నారా????

ఆయనే కమ్యునిష్ట్ గాంధీగా ,కామ్రేడ్ పి.యస్ గా అభిమానంగా పిలుచుకొనే పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి ఉరప్ పుచ్చలపల్లి సుందరరామయ్య గారు.. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము..

సుందరయ్యగారు గొప్ప అభ్యుదయవాది..సిద్దాంతం పట్ల నిబద్దత గల నాయకుడు..తెలంగాణా సాయుధ పోరాటంలో ఎంతో ముఖ్యమైన పాత్ర ఇతనిది… ఇలాంటి నాయకులు బహుఅరుదుగా పుడుతారు…మళ్ళీ మనదేశంలో సుందరరామయ్య లాంటి నాయకులు జన్మించాలని కోరుకుంటూ…”జోహార్ కామ్రేడ్ సుందరయ్యగారూ-” ???