Movies

ఆకాశమంతటి అంచనాలు

Megha Akash From Malayalam Industry To Succeed As Her Peers

రజనీకాంత్‌ ‘పేట’లో త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాష్‌ కాకుండా మాళవికా మోహనన్‌ కూడా నటించారు. అయితే పెద్ద స్టార్లు ఉండటం, పైగా తల్లి పాత్రలో నటించడంతో మాళవిక పేరు అంతగా చర్చకు రాలేదు. 2013లో ‘పట్టమ్‌ పోలే’ అనే మలయాళ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ తార ఆ తర్వాత మలయాళం, కన్నడ సినిమాలు కూడా చేశారు. ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌ను కూడా పలకరించిన మాళవిక ఇప్పుడు ‘హీరో’తో స్ట్రయిట్‌గా టాలీవుడ్‌ గడప తొక్కబోతున్నారు. ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ హీరో. బైక్‌ రేస్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అన్నట్లు చెప్పడం మరిచితిమి… ‘లస్ట్‌స్టోరీస్‌’ (2018), ‘అంధా ధున్‌’(2018), ‘మహర్షి’ (2019) సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్‌ చేసిన కేయు. మోహనన్‌ కుమార్తె మాళవిక మోహనన్‌. మలయాళ కుట్టీలు నిత్యామీనన్, నయనతార వంటివారు పేరు తెచ్చుకున్నట్లుగానే ఈ మలయాళీ కుట్టీ కూడా ఇక్కడ బోలెడంత పేరు తెచ్చుకుంటారనే అంచనాలు ఉన్నాయి.