Business

నాలుగు నెలల కనిష్టానికి రూపాయి

indian rupee reaches four month low

స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ రూపాయి పతనాన్ని నమోదు చేసుకున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దిగుమతిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో రూపాయి నాలుగు నెలల కనిష్ఠానికి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి రూ.69.86 వద్ద ముగిసింది. ఒక దశలో 69.97కి పడిపోయిన మారకం రేటు ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడంతో సూచీలు భారీగా పుంజుకున్నప్పటికీ..కరెన్సీ మాత్రం పతనాన్ని మూటగట్టుకున్నదని ఫారెక్స్ డీలర్ తెలిపారు. డిసెంబర్ 3, 2018 తర్వాత రూపాయి ఇదే కనీస స్థాయి.